Skip to content
Home » కరూర్ తొక్కిసలాట కేసు: విచారణకు హాజరుకావాలని టీవీకే చీఫ్ విజయ్ కు సీబీఐ తాజా నోటీసులు

కరూర్ తొక్కిసలాట కేసు: విచారణకు హాజరుకావాలని టీవీకే చీఫ్ విజయ్ కు సీబీఐ తాజా నోటీసులు

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నటుడు మరియు తమిళగ వెట్రి కజగం (టీవీకే) అధినేత విజయ్ కు సీబీఐ తాజా సమన్లు జారీ చేసింది కరూర్ తొక్కిసలాట కేసుకు సంబంధించి మూడవ విడత దర్యాప్తు కోసం మార్చి 10, మంగళవారం ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయంలో స్వయంగా హాజరు కావాలని కోరింది.

విజయ్ తరపు విజ్ఞప్తి.. 10-15 రోజుల గడువు

​అయితే తన తరపు న్యాయవాదుల ద్వారా సీబీఐకి విజయ్ లిఖితపూర్వక లేఖ పంపారు రాబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం, వ్యక్తిగత కారణాలు మరియు తన విడాకుల కేసు అంశాలను ప్రస్తావిస్తూ 10-15 రోజుల గడువు కోరారు అలాగే దర్యాప్తును ఢిల్లీలో కాకుండా చెన్నైలోనే జరపాలని అభ్యర్థించారు.

చెన్నై కాకుండా ఢిల్లీ ఎందుకు పిలిచారు

చెన్నైలో సీబీఐ కార్యాలయాలు ఉన్నప్పటికీ దర్యాప్తు కోసం పదే పదే ఢిల్లీకి పిలిపించడం వెనుక రాజకీయ ఒత్తిడి ఉందేమోనని టీవీకే నాయకులు తీవ్ర అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు, అయితే దీనిపై సీబీఐ సాంకేతిక వివరణ ఇచ్చింది, ఈ కేసు విచారణలో కీలకమైన సీసీటీవీ ఫుటేజ్ లు, మొబైల్ రికార్డింగ్ లు మరియు సోషల్ మీడియా వీడియోలను సాక్షులు ఒకేసారి వీక్షించి స్పందించేలా ఢిల్లీ ప్రధాన కార్యాలయంలో ప్రత్యేకంగా ఉన్న అత్యాధునిక ఆడియో-విజువల్ గదిలో విచారించాల్సి ఉన్నందునే అక్కడికి పిలిపించామని అధికారులు స్పష్టం చేశారు.

​కొత్త ఆధారాలతో 20 రోజుల్లో నివేదిక

టీవీకే ప్రతినిధులు గతంలో అందించిన వివరాలతో పాటు పోలీసు, రెవెన్యూ, విద్యుత్ శాఖల అధికారులు ఇచ్చిన స్టేట్ మెంట్ లను దర్యాప్తు అధికారులు క్రాస్ వెరిఫై చేస్తున్నారు, ఈ క్రమంలో కొన్ని కొత్త ఆధారాలు వెలుగులోకి రావడంతో ఈ అంశాలపై స్పష్టత కోసం విజయ్ తో పాటు ఇతర సాక్షులను విచారిస్తున్నారు, ఈ కేసు కొద్ది వారాల్లోనే సుప్రీంకోర్టులో విచారణకు రానున్న నేపథ్యంలో ప్రస్తుత రౌండ్ విచారణను 20 రోజుల్లోపు పూర్తి చేసి అత్యున్నత న్యాయస్థానానికి మధ్యంతర నివేదికను దాఖలు చేయాలని దర్యాప్తు అధికారులకు ఆదేశాలు అందాయి.

ఈ వార్తను షేర్ చేయండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *