|  
● FLASH NEWS
Hockey: ఏషియన్ గేమ్స్‌లో జపాన్‌పై ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన భారత మహిళల జట్టు  •  Hyderabad : తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం హైదరాబాద్ సిటీ అధ్యక్షుడిగా సురేష్ గౌడ్ నియామకం  •  Supreme Court : దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టులో భారీ షాక్..  •  NHRC Case on TG Hospitals : సర్కారు దవాఖానాల దుస్థితిపై ఎన్‌హెచ్‌ఆర్‌సీలో కేసు.. అడ్వకేట్ వినోద్ హిందుస్థానీ ఫిర్యాదు  •  PM Modi Chintan Baithak : ప్రధాని మోడీ అధ్యక్షతన నేడు, రేపు ‘చింతన్ బైఠక్’.. అజెండా ఇదే!  • 
Skip to content

UPSC Recruitment 2026 : బీఈడీ (B.Ed) అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. 828 ప్రిన్సిపల్ కొలువులకు నోటిఫికేషన్!

SuryaNewsWebOptimized

Hyderabad, Surya News: ఉపాధ్యాయ వృత్తిలో కెరీర్ కొనసాగించాలనుకునే నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం ఒక మంచి అవకాశం కల్పించింది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) ఢిల్లీ ప్రభుత్వ విద్యాశాఖలో (Government of NCT of Delhi) భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 828 ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలని కమిషన్ సూచించింది.

ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 828 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో ప్రిన్సిపల్ పోస్టులు 124 ఉన్నాయి. అలాగే వైస్ ప్రిన్సిపల్ పోస్టులు 704 వరకు కేటాయించారు.

​ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో మాస్టర్స్ డిగ్రీతో పాటు బీఈడీ (B.Ed) ఉత్తీర్ణులై ఉండాలి. నోటిఫికేషన్‌లో పేర్కొన్న విధంగా నిర్ణీత బోధనా అనుభవం కూడా తప్పనిసరిగా ఉండాలి. వయోపరిమితి విషయానికి వస్తే ప్రిన్సిపల్ పోస్టులకు జనరల్/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 50 ఏళ్లు, ఓబీసీలకు 53 ఏళ్లు, ఎస్సీ/ఎస్టీలకు 55 ఏళ్ల వరకు అవకాశం కల్పించారు. వైస్ ప్రిన్సిపల్ పోస్టులకు జనరల్/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 35 ఏళ్లు, ఓబీసీలకు 38 ఏళ్లు, ఎస్సీ/ఎస్టీలకు 40 ఏళ్ల గరిష్ట వయోపరిమితి నిర్ణయించారు.

అభ్యర్థుల ఎంపికను రెండు దశల్లో నిర్వహిస్తారు. మొదట కంబైన్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్ (CRT), ఆ తర్వాత ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు కింద జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.25 చెల్లించాలి. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి పూర్తి మినహాయింపు ఉంది.

ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ: జూలై 25, 2026.

ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: ఆగస్టు 14, 2026 సాయంత్రం 6 గంటల వరకు.

రాత పరీక్ష (CRT) తేదీ: నవంబర్ 1, 2026.

ఈ వార్తపై మీ స్పందన?

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp