|   
🔴 BREAKING NEWS ► NBK 111 Shooting : కాకినాడ పోర్టులో షూటింగ్.. నందమూరి బాలకృష్ణకు ప్రమాదం.. HYDRA Commissioner : సంచలనం.. హైడ్రా రంగనాథ్ అరెస్ట్ కు హైకోర్టు ఆదేశం Indian Railway Jobs : రైల్వేలో కొలువుల జాతర.. 119 సెక్షన్ కంట్రోలర్ పోస్టులకు బిగ్ నోటిఫికేషన్.. జీతం, అర్హతలు ఇవే Delhi High Court : సఫ్దర్ జంగ్ ఆసుపత్రిలో అక్రమ నిర్బంధం.. హైకోర్టును ఆశ్రయించిన సోనమ్ వాంగ్ చుక్ భార్య Shocking News : అర్ధరాత్రి రోడ్డుపై నగ్నంగా యువతి పరుగులు – చివరిసారిగా దేవుడికి దండం పెట్టుకుని నేరుగా చెరువులోకి
Skip to content

Vikram 1 Rocket Launch : టెన్షన్ టెన్షన్.. చివరి నిమిషంలో ఆగిపోయిన విక్రమ్-1 ప్రయోగం.. అసలేం జరిగిందంటే?

శ్రీహరికోట, సూర్య న్యూస్ : ప్రముఖ స్పేస్ టెక్ స్టార్టప్ (SpaceTech Startup) స్కైరూట్ ఏరోస్పేస్ (Skyroot Aerospace) సంస్థకు తృటిలో ముప్పు తప్పింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి ఆర్బిటాల్ క్లాస్ రాకెట్ విక్రమ్-1 (Vikram 1 Rocket Launch) ప్రయోగానికి చివరి నిమిషంలో అంతరాయం ఏర్పడింది. శ్రీహరికోటలోని (Sriharikota) సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం (SHAR) మొదటి ప్రయోగ వేదిక నుంచి ఈ రోజు ఉదయం 11.30 గంటలకు ఈ ప్రయోగం జరగాల్సి ఉంది. కౌంట్ డౌన్ సమయంలో అనుకోకుండా ఒక సాంకేతిక లోపం (Technical Issue) తలెత్తింది. దీంతో అప్రమత్తమైన శాస్త్రవేత్తలు ఈ రాకెట్ ప్రయోగాన్ని వెంటనే తాత్కాలికంగా నిలిపివేశారు.

పరిస్థితిని సమీక్షించిన శాస్త్రవేత్తలు లోపాన్ని గుర్తించేందుకు తీవ్రంగా శ్రమించారు. రాకెట్ ఇంధన ప్రక్రియలో (Fuel Process) సమస్య ఉన్నట్లు వారు గుర్తించారు. వెంటనే రంగంలోకి దిగి ఆ సమస్యను విజయవంతంగా సరిచేశారు. అనంతరం ఈ రోజు మధ్యాహ్నం 12.05 గంటలకు మళ్లీ విక్రమ్-1 రాకెట్ ప్రయోగించేందుకు కౌంట్ డౌన్ (Countdown) ప్రారంభించారు. సకాలంలో లోపాన్ని గుర్తించడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. ప్రయోగం నిలిచిపోవడంతో కొద్దిసేపు ఉత్కంఠ వాతావరణం నెలకొన్నా.. సమస్య పరిష్కారం కావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Surya News Logo
మరిన్ని బ్రేకింగ్ వార్తల కోసం
Surya News WhatsApp Channel లో జాయిన్ అవ్వండి
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp