|  
FLASH NEWS
YouTuber Nandus World Rama Nandana : యూట్యూబర్ రమా నందన అరెస్ట్.. లండన్ వీసా స్కామ్‌లో దిమ్మతిరిగే నిజాలు  •  నిరుద్యోగ యువతకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మోసం.. ఉద్యోగాల భర్తీకి ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం డిమాండ్  •  AP Politics : వైసీపీకి చిన్న శ్రీను రాజీనామా.. కీలక పదవులకు గుడ్‌బై  •  India vs Afghanistan : పాక్ ఆక్రమిత కాశ్మీర్‌ను భారత మ్యాప్‌లో చూపిన అఫ్గానిస్తాన్.. మండిపడుతున్న పీసీబీ  •  YouTuber Nandana : నిరుద్యోగులకు భారీ టోకరా.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో పట్టుబడిన ప్రముఖ యూట్యూబర్  • 
Skip to content

YouTuber Nandus World Rama Nandana : యూట్యూబర్ రమా నందన అరెస్ట్.. లండన్ వీసా స్కామ్‌లో దిమ్మతిరిగే నిజాలు

హైదరాబాద్, సూర్యా న్యూస్ : లండన్ లైఫ్‌స్టైల్ వీడియోలతో తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న ప్రముఖ యూట్యూబర్ (Telugu YouTuber), ‘నందూస్ వరల్డ్’ ఫేమ్ రమా నందనను సోమవారం శంషాబాద్ ఎయిర్‌పోర్టులో (Shamshabad Airport) ఇమ్మిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. లండన్‌లో ఉద్యోగాలు, వీసాల పేరుతో భారీ మోసానికి పాల్పడ్డారనే ఆరోపణల నేపథ్యంలో విదేశాల నుంచి రాగానే ఆమెను అరెస్ట్ చేసి, తదుపరి విచారణ నిమిత్తం ఏపీలోని ఇబ్రహీంపట్నం పోలీసులకు అప్పగించారు. విదేశాల్లో ఉద్యోగాల పేరుతో కోట్ల రూపాయల వసూళ్లకు పాల్పడి పరారైన నందన దంపతులపై ఏపీ పోలీసులు గతంలోనే లుక్‌ఔట్ సర్క్యులర్ (LOC) జారీ చేశారు.

గుంటూరుకు చెందిన రమా నందన లండన్‌లో స్థిరపడి తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా దాదాపు 28 లక్షల మంది సబ్‌స్క్రైబర్స్‌ను సొంతం చేసుకున్నారు. విదేశాలకు వెళ్లాలనే యువత కలను ఆసరాగా చేసుకుని ‘డెస్టినీ కన్సల్టెన్సీ’ అనే సంస్థ ద్వారా యూకేలో ఉద్యోగాలు, వీసా ఎక్స్‌టెన్షన్లు, సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్‌షిప్ ఇప్పిస్తామంటూ ప్రచారం చేశారు. వీరి మాటలు నమ్మిన ఎంతోమంది బాధితులు పొలాలు అమ్మి మరీ లక్షలాది రూపాయలు చెల్లించారు. తీరా డబ్బులు తీసుకున్నాక నకిలీ డాక్యుమెంట్లు చేతిలో పెట్టడం, ఆ తర్వాత కాంటాక్ట్‌లోకి రాకుండా ముఖం చాటేయడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు.

నేరం భర్తదే అన్న యూట్యూబర్

అరెస్ట్ అనంతరం ఇబ్రహీంపట్నం పోలీసుల విచారణలో రమా నందన కీలక విషయాలు వెల్లడించారు. వీసా స్కామ్ వ్యవహారంతో తనకు ఎలాంటి సంబంధం లేదని, ఆ మోసాలన్నీ తన భర్త మధుకరే చేశాడని ఆమె వాంగ్మూలం ఇచ్చినట్లు సమాచారం. తనకేమీ తెలియదని, తనపై ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం జరుగుతోందని ఆమె పోలీసుల ఎదుట వాపోయారు. అయితే ఆమె అరెస్ట్ వార్త తెలుసుకున్న బాధితులు పోలీస్ స్టేషన్‌కు చేరుకుని, తాము వీడియోలు చూసే మోసపోయామని, తమ డబ్బులు తిరిగి ఇప్పించాలని డిమాండ్ చేశారు.

పరారీలో భర్త.. 16న మళ్లీ విచారణ

ఈ వీసా స్కామ్ కేసులో కీలకంగా భావిస్తున్న రమా నందన భర్త మధుకర్ కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. కాగా, రమా నందన స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేసిన పోలీసులు.. ఈ నెల 16వ తేదీన మరోసారి విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ చేశారు. పూర్తి స్థాయి విచారణ తర్వాతే ఈ స్కామ్‌లో నందన పాత్ర ఎంతనేది తేలుతుందని పోలీసులు చెబుతున్నారు. ఈ మోసాలపై ఇప్పటికే అద్దంకితో పాటు ఏపీలోని పలు పోలీస్ స్టేషన్లలో రమా నందన దంపతులపై కేసులు నమోదయ్యాయి.

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp