|  
FLASH NEWS
YouTuber Nandus World Rama Nandana : యూట్యూబర్ రమా నందన అరెస్ట్.. లండన్ వీసా స్కామ్‌లో దిమ్మతిరిగే నిజాలు  •  నిరుద్యోగ యువతకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మోసం.. ఉద్యోగాల భర్తీకి ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం డిమాండ్  •  AP Politics : వైసీపీకి చిన్న శ్రీను రాజీనామా.. కీలక పదవులకు గుడ్‌బై  •  India vs Afghanistan : పాక్ ఆక్రమిత కాశ్మీర్‌ను భారత మ్యాప్‌లో చూపిన అఫ్గానిస్తాన్.. మండిపడుతున్న పీసీబీ  •  YouTuber Nandana : నిరుద్యోగులకు భారీ టోకరా.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో పట్టుబడిన ప్రముఖ యూట్యూబర్  • 
Skip to content

​యూపీ నియంతృత్వ రాజ్యంగా మారే ప్రమాదం.. కలెక్టర్ జీతం నుంచే 5 లక్షల ఫైన్ వసూలు: హైకోర్టు సంచలన తీర్పు

District collector medha rupam
District collector medha rupam

ప్రయాగ్‌రాజ్, సూర్య న్యూస్ : ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) భవిష్యత్తులో నియంతృత్వ రాజ్యంగా మారే ప్రమాదం ఉందని అలహాబాద్ హైకోర్టు (Allahabad High Court) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థిని, సామాజిక కార్యకర్త ఆకృతి చౌదరిపై ఎటువంటి ఆధారాలు లేకుండానే జాతీయ భద్రతా చట్టం కింద కేసు నమోదు చేయడాన్ని ధర్మాసనం తీవ్రంగా తప్పుపట్టింది. ఆమెపై ఉన్న కేసును కొట్టివేసిన కోర్టు.. బాధితురాలికి ఐదు లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించింది. ఈ మొత్తాన్ని ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషించిన గౌతమ్ బుద్ధ నగర్ జిల్లా కలెక్టర్ మేధా రూపంతో పాటు ఎన్ఎస్ఏ నివేదికను సిద్ధం చేసిన పోలీసు అధికారుల జీతాల నుంచి వసూలు చేయాలని సంచలన తీర్పు వెలువరించింది.

అధికారుల తీరుపై ధర్మాసనం ఆగ్రహం

జస్టిస్ అతుల్ శ్రీధరన్, జస్టిస్ అచల్ సచ్‌దేవ్‌లతో కూడిన ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. అధికారుల వైఖరి, నిరంకుశ ప్రవర్తన వల్ల రాష్ట్రం ఆర్వెలియన్ డిస్టోపియాగా మారే ప్రమాదం ఉందని హెచ్చరించింది. తగిన ఆధారాలు లేకుండా విద్యార్థినిని జైలులో ఉంచడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం ఆమె ప్రాథమిక హక్కును హరించడమేనని స్పష్టం చేసింది. పోలీసుల నివేదికల ఆధారంగా ఎటువంటి లోతైన పరిశీలన చేయకుండానే కలెక్టర్ మేధా రూపం ఎన్ఎస్ఏ చట్టాన్ని ప్రయోగించారని కోర్టు మండిపడింది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలే యజమానులని, అధికారులు బ్రిటిష్ కాలం నాటి వలసవాద ధోరణితో కాకుండా రాజ్యాంగానికి కట్టుబడి సేవ చేయాలని హితవు పలికింది.

పోలీసుల తప్పుడు పత్రాలు, అరెస్టులో వైరుధ్యాలు

ఈ ఏడాది ఏప్రిల్‌లో నోయిడా కార్మికుల నిరసనల నేపథ్యంలో పోలీసులు ఆకృతి చౌదరిని అరెస్టు చేశారు. అనంతరం మే 13న ఆమెపై ఎన్ఎస్ఏ చట్టాన్ని ప్రయోగించారు. కార్మికులను ఆమె హింసకు ప్రేరేపించినట్లు పోలీసులు ఆరోపించినప్పటికీ, అందుకు సంబంధించిన ఎలాంటి ఆధారాలు, వాట్సాప్ చాట్లు గానీ కోర్టు ముందు సమర్పించలేకపోయారు. అలాగే, ఏప్రిల్ 11న సాయంత్రమే ఆమెను బొటానికల్ గార్డెన్ మెట్రో స్టేషన్ వద్ద అదుపులోకి తీసుకున్న పోలీసులు, ఏప్రిల్ 12న అరెస్టు చేసినట్లు రికార్డుల్లో తప్పుడు పత్రాలు సృష్టించడాన్ని న్యాయమూర్తులు ఎత్తిచూపారు. హక్కుల కోసం శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారి భావప్రకటన స్వేచ్ఛను హరించేలా ఇలాంటి అణచివేత చర్యలకు పాల్పడటం సరికాదని కోర్టు స్పష్టం చేసింది.

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp