|  
● FLASH NEWS
Jaladhara: ఏపీలో రూ.30 వేల కోట్లతో ‘అమరజీవి జలధార’ లాంచ్  •  EVMs: పేపర్ బ్యాలెట్ కోసం ఢిల్లీలో పోరాటం : కల్వకుంట్ల కవిత  •  Housing: ఏపీలో 3 లక్షల ఇళ్ల నిర్మాణాలకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన  •  Honeytrap: పాక్ కిలేడీ వలలో నేవీ ఉద్యోగి.. అరెస్ట్  •  INDvsWI: సిరీస్ విండీస్ వశం.. కేఎల్ రాహుల్ అరుదైన రికార్డు  • 
Skip to content

నివాసాల మధ్య చేపల మార్కెట్ వద్దు : ప్రగతి నగర్ – ప్రశాంతి హిల్స్‌లో కాలనీ వాసుల నిరసన

ప్రగతినగర్, సూర్య న్యూస్ : జీహెచ్‌ఎంసీ నిజాంపేట్ సర్కిల్ పరిధిలోని ప్రగతినగర్ డివిజన్ ప్రశాంతి హిల్స్ కాలనీలో చేపల మార్కెట్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ కాలనీ వాసులు శనివారం పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. నివాస ప్రాంతాలు, దేవాలయాలు మరియు పార్కుల మధ్యలో మార్కెట్ ఏర్పాటు చేయడం వల్ల స్థానికంగా తీవ్ర అసౌకర్యం కలుగుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయం తెలుసుకున్న బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి రచ్చ చక్రధర్ సంఘటనా స్థలానికి చేరుకుని కాలనీ ప్రజలకు తన మద్దతు ప్రకటించారు.

​ఈ సందర్భంగా రచ్చ చక్రధర్ మాట్లాడుతూ ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా అధికారులు ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం సరైన పద్ధతి కాదని ఖండించారు. రెసిడెన్షియల్ ప్లాట్లు, దేవాలయాల సమీపంలో చేపల మార్కెట్ ఏర్పాటు చేయడం వల్ల ఆ ప్రాంతంలో పరిశుభ్రత దెబ్బతినడమే కాకుండా ప్రజల ఆరోగ్యానికి ముప్పు వాటిల్లే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కాలనీ ప్రశాంతతను భంగపరిచే ఈ నిర్ణయాన్ని అధికారులు వెంటనే వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

స్థానిక ప్రజల ఆరోగ్యం మరియు జీవన ప్రమాణాలను దృష్టిలో ఉంచుకుని, చేపల మార్కెట్‌కు మరేదైనా అనుకూలమైన ప్రాంతాన్ని ఎంపిక చేయాలని ఆయన అధికారులను కోరారు. కాలనీ వాసుల అభిప్రాయాలను గౌరవించని పక్షంలో ఆందోళనను ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాలనీ ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో స్థానికులు మరియు అధికారులు పాల్గొన్నారు.

ఈ వార్తపై మీ స్పందన?

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📲 Join WhatsApp