|   
🔴 BREAKING NEWS ► NBK 111 Shooting : కాకినాడ పోర్టులో షూటింగ్.. నందమూరి బాలకృష్ణకు ప్రమాదం.. HYDRA Commissioner : సంచలనం.. హైడ్రా రంగనాథ్ అరెస్ట్ కు హైకోర్టు ఆదేశం Indian Railway Jobs : రైల్వేలో కొలువుల జాతర.. 119 సెక్షన్ కంట్రోలర్ పోస్టులకు బిగ్ నోటిఫికేషన్.. జీతం, అర్హతలు ఇవే Delhi High Court : సఫ్దర్ జంగ్ ఆసుపత్రిలో అక్రమ నిర్బంధం.. హైకోర్టును ఆశ్రయించిన సోనమ్ వాంగ్ చుక్ భార్య Shocking News : అర్ధరాత్రి రోడ్డుపై నగ్నంగా యువతి పరుగులు – చివరిసారిగా దేవుడికి దండం పెట్టుకుని నేరుగా చెరువులోకి
Skip to content

Duofit Summer Camp : ప్రగతి నగర్ లో ముగిసిన డ్యుయోఫిట్ సమ్మర్ క్యాంప్.. విద్యార్థులకు సర్టిఫికెట్ల ప్రదానం

డ్యుయోఫిట్ సమ్మర్ యాక్టివిటీ (Duofit Summer Activity) కోచ్ లు నిఖిత మరియు నితేష్ లను ఘనంగా సన్మానించిన కాలనీ వాసులు

ప్రగతి నగర్, సూర్య న్యూస్ : హైదరాబాద్ (Hyderabad) లోని ప్రగతి నగర్ (Pragathi Nagar) లో గల ప్రశాంతి హిల్స్ పార్క్ (Prashanti Hills Park) లో డ్యుయోఫిట్ సమ్మర్ క్యాంప్ విజయవంతంగా ముగిసింది. మే 1వ తేదీన ప్రారంభమైన ఈ ఉచిత శిక్షణా శిబిరం మే 30వ తేదీ వరకు కొనసాగింది. డ్యుయోఫిట్ కోచ్ (Duofit Coach) నిఖిత ఆధ్వర్యంలో జరిగిన ఈ క్యాంప్ లో విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు.

Surya News Logo
మరిన్ని బ్రేకింగ్ వార్తల కోసం
Surya News WhatsApp Channel లో జాయిన్ అవ్వండి
Join

నెల రోజుల పాటు జరిగిన ఈ శిక్షణలో చిన్నారులకు క్రీడలు మరియు శారీరక దారుఢ్యం పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమం ముగింపు సందర్భంగా శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థులకు సర్టిఫికెట్లు (Certificates) అందజేశారు. ముఖ్య అతిథులుగా నారాయణ రెడ్డి, రిటైర్డ్ ప్రభుత్వ కోచ్ కొండల్ రావు (Kondal Rao), మరియు టి.ఎం రావు హాజరై విద్యార్థులకు అవార్డులు ప్రధానం చేశారు. క్రీడలు పిల్లల శారీరక మరియు మానసిక ఎదుగుదలకు ఎంతగానో ఉపయోగపడతాయని వారు ఈ సందర్భంగా పేర్కొన్నారు.

కాలనీలోని పిల్లలకు నిస్వార్ధంగా ఈ ఉచిత సమ్మర్ క్యాంపును (Free Summer Camp) నిర్వహించిన కోచ్ లకు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ క్యాంపును విజయవంతంగా నిర్వహించినందుకు గాను డ్యుయోఫిట్ కోచ్ లు నిఖిత మరియు నితేష్ లను ప్రశాంతి హిల్స్ కాలనీ (Prashanti Hills Colony) వాసులు ఘనంగా సన్మానించారు.

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📲 Join WhatsApp