|  
● FLASH NEWS
Jaladhara: ఏపీలో రూ.30 వేల కోట్లతో ‘అమరజీవి జలధార’ లాంచ్  •  EVMs: పేపర్ బ్యాలెట్ కోసం ఢిల్లీలో పోరాటం : కల్వకుంట్ల కవిత  •  Housing: ఏపీలో 3 లక్షల ఇళ్ల నిర్మాణాలకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన  •  Honeytrap: పాక్ కిలేడీ వలలో నేవీ ఉద్యోగి.. అరెస్ట్  •  INDvsWI: సిరీస్ విండీస్ వశం.. కేఎల్ రాహుల్ అరుదైన రికార్డు  • 
Skip to content

Free Medical Camp : విస్సన్నపేటలో ఉచిత గుండె వైద్య శిబిరం.. ఎప్పుడు, ఎక్కడంటే?

విస్సన్నపేట, సూర్య న్యూస్ : విస్సన్నపేట (Vissannapeta) వాసులకు ఒక మంచి అవకాశం. విజయవాడలోని ప్రముఖ సెంటినీ హాస్పిటల్ (Sentini Hospital) మరియు విస్సన్నపేటలోని అవిన్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ (Avinya Hospital) సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. సెంటినీ కార్డియాక్ ఓపీ సేవలు ప్రారంభిస్తున్న సందర్భంగా ఈ ఉచిత వైద్య శిబిరం (Free Medical Camp) నిర్వహించనున్నారు.

ఈ శిబిరంలో ప్రముఖ గుండె వైద్య నిపుణులు (Cardiologist) డాక్టర్ వరుణ్ నల్లమోతు ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి సలహాలు ఇస్తారు. ఉచితంగా బీపీ, షుగర్ పరీక్షలు చేస్తారు. అవసరమైన వారికి ఈసీజీ (ECG), 2డీ ఎకో (2D Echo) వంటి పరీక్షలు కూడా ఉచితంగా చేస్తారు. కార్డియాలజిస్ట్ కన్సల్టేషన్ కూడా ప్రజలు ఉచితంగా పొందవచ్చు.

ఈ ఉచిత వైద్య శిబిరం ఆగస్టు 3వ తేదీ సోమవారం (Monday) జరుగుతుంది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు వైద్యులు అందుబాటులో ఉంటారు. వికాస్ ఇంటర్, డిగ్రీ కాలేజ్ రోడ్ లో ఉన్న అవిన్య హాస్పిటల్ నందు ఈ కార్యక్రమం జరుగుతుంది. గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు (Organizers) కోరారు. శిబిరానికి సంబంధించిన మరిన్ని వివరాలకు 9618972787 లేదా 9515592376 నంబర్లను సంప్రదించవచ్చని వారు తెలిపారు.

ఈ వార్తపై మీ స్పందన?

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp