|  
FLASH NEWS
నిరుద్యోగ యువతకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మోసం.. ఉద్యోగాల భర్తీకి ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం డిమాండ్  •  AP Politics : వైసీపీకి చిన్న శ్రీను రాజీనామా.. కీలక పదవులకు గుడ్‌బై  •  India vs Afghanistan : పాక్ ఆక్రమిత కాశ్మీర్‌ను భారత మ్యాప్‌లో చూపిన అఫ్గానిస్తాన్.. మండిపడుతున్న పీసీబీ  •  YouTuber Nandana : నిరుద్యోగులకు భారీ టోకరా.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో పట్టుబడిన ప్రముఖ యూట్యూబర్  •  Telangana Assembly : నా చీర లాగారు.. అసెంబ్లీ వద్ద కన్నీళ్లు పెట్టుకున్న సునీతా లక్ష్మారెడ్డి  • 
Skip to content

Vizag Accident : విశాఖ స్టీల్ ప్లాంట్‌లో మహా విషాదం.. ఆ కుటుంబాలకు తీరని శోకం.. ఇంతకీ ఈ ఘోర ప్రమాదానికి కారణం ఏంటి?

విశాఖపట్నం, సూర్య న్యూస్: విశాఖపట్నం ఉక్కు కర్మాగారంలో (Vizag Steel Plant) తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కర్మాగారంలో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో (Fire Accident) ఎనిమిది మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ హృదయ విదారక ఘటన స్థానికంగా మరియు పారిశ్రామిక వర్గాల్లో తీవ్ర ఆందోళన రేకెత్తించింది. ద్రవ ఉక్కు ఒక్కసారిగా మీద పడటంతో కార్మికులు సజీవ దహనమైనట్లు తెలుస్తోంది.

ప్లాంట్‌లోని సీసీడీ (CCD) విభాగంలో లిక్విడ్ స్టీల్ నిర్వహణ సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. సుమారు 1500 డిగ్రీల ఉష్ణోగ్రతతో ఉన్న స్టీల్ మెటల్ లిక్విడ్ లాడిల్ (Liquid Ladle) అకస్మాత్తుగా పేలిపోయింది. దీంతో హాట్ మెటల్ బకెట్ ఒక్కసారిగా కుప్పకూలి కింద పనిచేస్తున్న కార్మికులపై ద్రవ ఉక్కు పడింది. ఈ భయానక ఘటనలో అక్కడికక్కడే ఎనిమిది మంది మృతి చెందగా, మరికొందరు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రాణభయంతో ఉద్యోగులు బయటకు పరుగులు తీశారు.

ప్రమాదం జరిగిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి మంటలను అదుపు చేసేందుకు సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. స్టీల్ ప్లాంట్ ఉన్నతాధికారులతో ఫోన్‌లో మాట్లాడి ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన ఆయన, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని, అన్ని శాఖల సమన్వయంతో సహాయక చర్యలు ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు.

​📲 మరిన్ని తాజా వార్తలు, బ్రేకింగ్ అప్‌డేట్స్ కోసం Surya News WhatsApp Channel లో చేరండి 👇

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📲 Join WhatsApp