|   
🔴 BREAKING NEWS ► PM Modi Latest Video : మరో వీడియో విడుదల చేసిన ప్రధాని మోదీ.. Supreme Court Guidelines : కోర్టు వీడియోలు ఎడిట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారా? సుప్రీంకోర్టు సంచలన ఉత్తర్వులు Police Job Aspirant Arrested : నిరుద్యోగుల బంద్ ఎఫెక్ట్.. హాస్టల్ వద్దే పోలీస్ అభ్యర్థి నవీన్ పట్నాయక్ అరెస్ట్ Delhi Police Warning : ఆందోళనకారులకు ఢిల్లీ పోలీసుల సంచలన వార్నింగ్.. ఆ తప్పు చేశారో ఇక మీ పాస్‌పోర్ట్ రద్దే Nandamuri Balakrishna Knee Surgery : నందమూరి అభిమానులకు గుడ్ న్యూస్.. బాలయ్య మోకాలి ఆపరేషన్ సక్సెస్
Skip to content

Supreme Court Guidelines : కోర్టు వీడియోలు ఎడిట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారా? సుప్రీంకోర్టు సంచలన ఉత్తర్వులు

​New Delhi, Surya News: కోర్టు విచారణలకు సంబంధించిన ఆడియో, వీడియోలను ముందస్తు అనుమతి లేకుండా సోషల్ మీడియా (Social Media) లో పోస్ట్ చేయడంపై సుప్రీంకోర్టు (Supreme Court) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అనుమతి లేకుండా విచారణ దృశ్యాలను నెట్టింట షేర్ చేయడంపై నిషేధం విధిస్తూ కీలక మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

Surya News Logo
మరిన్ని బ్రేకింగ్ వార్తల కోసం
Surya News WhatsApp Channel లో జాయిన్ అవ్వండి
Join

​కోర్టు విచారణల వీడియోలు లేదా ఆడియో కంటెంట్ ను నెట్టింట పోస్ట్ చేయాలంటే ఇకపై కఠిన నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. దీనికోసం సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్ (Secretary General) లేదా సంబంధిత హైకోర్టుల రిజిస్ట్రార్ జనరల్ (Registrar General) నుంచి ముందస్తు అనుమతి తీసుకోవడం తప్పనిసరి అని ధర్మాసనం స్పష్టం చేసింది. జస్టిస్ సూర్యకాంత్ (Justice Surya Kant), జస్టిస్ జయమాల్య బాగ్చీ (Justice Joymalya Bagchi) లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ ఆదేశాలు ఇచ్చింది.

​ఇటీవల కోర్టు లైవ్ స్ట్రీమింగ్ (Live Streaming) ద్వారా వస్తున్న వీడియోలను కొందరు ఉద్దేశపూర్వకంగా ఎడిట్ చేసి క్లిప్పింగ్ లుగా మార్చి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారని జర్నలిస్ట్ హర్షిత గ్రోవర్ ప్రజా ప్రయోజన వ్యాజ్యం (PIL) దాఖలు చేశారు. పిటిషనర్ తరపున వాదనలు వినిపించిన సీనియర్ అడ్వకేట్ వికాస్ సింగ్ (Senior Advocate Vikas Singh), విచారణలోని కొన్ని సంచలనాత్మక భాగాలను మాత్రమే కట్ చేసి వైరల్ చేయడం వల్ల న్యాయవ్యవస్థ గౌరవానికి భంగం వాటిల్లుతోందని తెలిపారు.

పిటిషనర్ వాదనలతో సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా (Solicitor General Tushar Mehta) కూడా ఏకీభవించారు. ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI Tools) ఉపయోగించి న్యాయమూర్తులు, అడ్వకేట్ల వాయిస్ ను, పెదవుల కదలికలను మార్చేసే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై కచ్చితమైన నియంత్రణలు ఉండాలని కోర్టుకు విన్నవించారు.

​ఈ సందర్భంగా జస్టిస్ జాయ్ మాల్య బాగ్చీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. డిజిటల్ యుగంలో డేటాను కంట్రోల్ చేయడం అతిపెద్ద సవాలుగా మారిందన్నారు. న్యాయస్థానాలు 24 గంటలూ ప్రసారమయ్యే ఎంటర్ టైన్ మెంట్ ఛానెళ్లు కావు అని స్పష్టం చేశారు. అందువల్ల లైవ్ స్ట్రీమింగ్ ను పరిమితం చేయాల్సిన అవసరం ఉందన్నారు. లైవ్ స్ట్రీమింగ్ వీడియోల దుర్వినియోగంపై కేంద్ర ప్రభుత్వంతో పాటు మెటా (Meta), ఎక్స్ (X – Twitter) వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp