|  
● FLASH NEWS
Konda Surekha: మంత్రి పదవి పోయిందన్న బాధ లేదు.. అనుచరులపై ఈగవాలినా ఊరుకోం  •  AsianGames: ట్రాక్‌పై భారత అథ్లెట్ల అద్భుత ప్రదర్శన.. ఖాతాలో మరో స్వర్ణం  •  PawanKalyan: వైసీపీ పాలనలో బ్లీచింగ్ పౌడర్ కూడా కొనలేని దుస్థితి  •  AP Liquor: క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మద్యం నాణ్యత తెలుసుకోండి  •  Supreme Court: సుప్రీంకోర్టు జడ్జిగా తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్?  • 
Skip to content

Supreme Court of India : ఇద్దరు లేడీ ఆఫీసర్ల ఫైటింగ్.. ఎట్టకేలకు సుప్రీం కోర్టు సంచలన నిర్ణయం!

Hyderabad, Surya News:కర్ణాటక (Karnataka) కేడర్ కి చెందిన ఐఏఎస్ ఆఫీసర్ రోహిణి సింధూరి (IAS Rohini Sindhuri), ఐపీఎస్ ఆఫీసర్ రూప దివాకర్ (IPS Roopa Divakar) మధ్య జరుగుతున్న వివాదం పై సుప్రీం కోర్టు ఆఫ్ ఇండియా (Supreme Court of India) కీలక నిర్ణయం తీసుకుంది. ఒకరిపై మరొకరు పరువు నష్టం (Defamation) దావా వేసుకోవడంతో ఈ వ్యవహారం సుప్రీం కోర్టుకు చేరింది. ఈ కేసును విచారించిన న్యాయస్థానం వారిద్దరిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇద్దరూ అద్భుతమైన ఆఫీసర్లు అని, అనవసరంగా ఒకరి కెరీర్ ని ఇంకొకరు నాశనం చేసుకుంటున్నారని కోర్టు పేర్కొంది.

Supreme Court of India : మధ్యవర్తిగా రిటైర్డ్ జస్టిస్ నియామకం

​గత 2023 లో ఐఏఎస్ రోహిణి సింధూరి అవినీతికి (Corruption) పాల్పడుతోందని ఐపీఎస్ రూప తీవ్ర ఆరోపణలు చేశారు. రోహిణి తన ప్రైవేట్ ఫోటోలను సీనియర్ మేల్ ఆఫీసర్లకు పంపుతూ చట్ట వ్యతిరేక పనులు చేస్తుందని సోషల్ మీడియాలో (Social Media) కొన్ని ఫోటోలను రూప లీక్ చేశారు. దీనితో రూపపై రోహిణి పరువు నష్టం దావా వేశారు. అదే సమయంలో రోహిణిపై కూడా రూప డిఫమేషన్ (Defamation) కేసు వేశారు. ఈ రెండు పిటిషన్ల పై నేడు విచారణ జరిపిన సుప్రీం కోర్టు ఆఫ్ ఇండియా (Supreme Court of India) ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు ఒక ముందడుగు వేసింది. రిటైర్డ్ జస్టిస్ కురియన్ జోసెఫ్ ని (Justice Kurian Joseph) ఈ కేసుకు మధ్యవర్తిగా (Mediator) నియమిస్తూ తీర్పు వెలువరించింది.

ఈ వార్తపై మీ స్పందన?

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📲 Join WhatsApp