|   
🔴 BREAKING NEWS ► Trainee IPS Case : సీపీ సజ్జనార్‌పై సంచలన ఆరోపణలు.. ఎన్‌కౌంటర్ చేస్తానని బెదిరించారంటూ ట్రైనీ ఐపీఎస్ ఫిర్యాదు! UPI Transaction Charges : యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు.. సామాన్యులపై భారం పడుతుందా? నిర్మలా సీతారామన్ క్లారిటీ ఇదే! Thalapathy Vijay Divorce : సీఎం విజయ్‌కు ఊరట.. విడాకుల పిటిషన్ వెనక్కి తీసుకున్న భార్య సంగీత IRCTC Sapta Jyotirlinga Yatra : ఒక్క ట్రిప్‌లోనే 7 జ్యోతిర్లింగాల దర్శనం.. ఐఆర్‌సిటిసి ప్రత్యేక భారత్ గౌరవ్ టూర్ ప్యాకేజీ వివరాలు ఇవే AP Weather Alert : ఏపీకి భారీ వర్ష సూచన.. ఆ జిల్లాల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలి
Skip to content

TIMS Hyderabad Jobs : సనత్‌నగర్ టిమ్స్‌లో 184 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు.. అర్హతలు, దరఖాస్తు వివరాలు ఇవే!

Hyderabad, Surya News:హైదరాబాద్‌లోని సనత్‌నగర్‌లో నూతనంగా నిర్మించిన తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (TIMS) ఆసుపత్రిలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. ఈ ఆసుపత్రి పరిపాలన, నియామక బాధ్యతలను ఉన్నత ప్రమాణాలతో నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిమ్స్ (NIMS) కు అప్పగించింది. ఈ క్రమంలో నిమ్స్ మొత్తం 184 కాంట్రాక్ట్ పోస్టుల భర్తీ కోసం మూడు వేర్వేరు నోటిఫికేషన్లను మంగళవారం జారీ చేసింది. ఏడాది కాలపరిమితితో కాంట్రాక్ట్, తాత్కాలిక ప్రాతిపదికన ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

పోస్టుల వివరాలు ఇలా..

Surya News Logo
మరిన్ని బ్రేకింగ్ వార్తల కోసం
Surya News WhatsApp Channel లో జాయిన్ అవ్వండి
Join

మొత్తం 184 ఖాళీలలో 31 మెడికల్ ఫ్యాకల్టీ పోస్టులు ఉన్నాయి. వీటిలో 5 ప్రొఫెసర్, 2 అసోసియేట్ ప్రొఫెసర్, 24 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఉన్నాయి. టెక్నికల్, అలైడ్ హెల్త్, అడ్మినిస్ట్రేటివ్ విభాగాల్లో 122 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ 122 ఖాళీలలో 24 అడ్మినిస్ట్రేటివ్ పోస్టులు, 98 వివిధ రకాల టెక్నీషియన్ పోస్టులు ఉన్నాయి. సపోర్ట్, ఇంజనీరింగ్, సెక్యూరిటీ, లీగల్, పీఆర్ తదితర విభాగాల్లో మరో 31 పోస్టులను భర్తీ చేయనున్నారు. కార్డియాలజీ, న్యూరాలజీ, నెఫ్రాలజీ, యూరాలజీ, గ్యాస్ట్రోఎంటరాలజీ, న్యూరోసర్జరీ వంటి సూపర్ స్పెషాలిటీ విభాగాల్లో మెడికల్ ఫ్యాకల్టీ నియామకాలు చేపట్టనున్నారు.

అర్హతలు మరియు వయోపరిమితి

మెడికల్ ఫ్యాకల్టీ పోస్టులకు సంబంధిత స్పెషాలిటీలో డీఎం, ఎం.సీహెచ్, డీఎన్‌బీ, డాక్టర్ఎన్‌బీ అర్హతలతో పాటు నిమ్స్, ఎన్‌ఎంసీ నిబంధనల ప్రకారం అనుభవం ఉండాలి. ఇతర పోస్టులకు డిగ్రీ, పీజీ, బీఎస్సీ, డిప్లొమా, బీఈ, బీటెక్, ఎంసీఏ, ఎంఎస్సీ తదితర అర్హతలను నోటిఫికేషన్‌లో నిర్దేశించారు. మెడికల్ ఫ్యాకల్టీ పోస్టులకు గరిష్ట వయోపరిమితిని 50 నుంచి 58 ఏళ్లుగా నిర్ణయించారు. ఇతర పోస్టులకు నోటిఫికేషన్‌లో పేర్కొన్న విధంగా వయోపరిమితి వర్తిస్తుంది.

దరఖాస్తు విధానం మరియు లాస్ట్ డేట్

మెడికల్ ఫ్యాకల్టీ (Medical Faculty) పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు జులై 6వ తేదీ ఉదయం 9 గంటలకు నిమ్స్‌లో జరిగే వాక్-ఇన్ (Walk-In Interview) ఇంటర్వ్యూకు నేరుగా హాజరుకావాల్సి ఉంటుంది. మిగిలిన ఇతర పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తమ పూర్తి వివరాలతో కూడిన అప్లికేషన్ (Application) లేదా సీవీతో పాటు అవసరమైన అన్ని సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలపై సెల్ఫ్ అటెస్టేషన్ చేసి కవర్‌లో పెట్టి పంపాలి. కవర్ పైన ఏ పోస్టుకు దరఖాస్తు చేస్తున్నారో స్పష్టంగా రాయాలి. ఈ దరఖాస్తులను జులై 6వ తేదీ సాయంత్రం 4 గంటలలోపు నిమ్స్‌లో సమర్పించాల్సి ఉంటుంది. అర్హతలు, వేతనాలు, రిజర్వేషన్లు తదితర పూర్తి వివరాల కోసం అభ్యర్థులు www.nims.edu.in వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు.

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp