|  
● FLASH NEWS
VijayDeverakonda: ట్రోలర్స్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన విజయ్  •  Nobel: భారత సంతతి మహిళకు నోబెల్ శాంతి బహుమతి.. ట్రంప్‌పై సెటైర్లు  •  Bypolls: ముస్లిం మెజార్టీ స్థానాల్లో బీజేపీ హవా  •  KCR: సీఎం రేవంత్‌పై వ్యూహం మార్చిన కేసీఆర్.. టార్గెట్ కొడంగల్!  •  NFSC : ఫెలోషిప్‌ల జాప్యంపై యువ న్యాయవాది పోరాటం  • 
Skip to content

TIMS Hospital: అల్వాల్ టిమ్స్ ఆసుపత్రికి 339 పోస్టులు మంజూరు

హైదరాబాద్, సూర్య న్యూస్ : రాష్ట్రంలో ప్రజా వైద్యానికి పెద్దపీట వేస్తున్న తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అల్వాల్‌లో నూతనంగా నిర్మిస్తున్న తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (TIMS Hospital) ఆసుపత్రికి కొత్తగా 339 పోస్టులను మంజూరు చేసింది. ఈ ఖాళీల భర్తీకి అనుమతి తెలుపుతూ రాష్ట్ర ఆర్థిక శాఖ (Finance Department) అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ ఆసుపత్రిలో వివిధ విభాగాలకు సంబంధించి ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. ముఖ్యంగా వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, పారామెడికల్ సిబ్బందితో పాటు అడ్మినిస్ట్రేటివ్, ఇంజనీరింగ్ విభాగాల్లోని ఖాళీలను భర్తీ చేస్తారు. ఎయిమ్స్ వేతనాల ప్రాతిపదికన ఈ నియామకాలను చేపట్టనున్నారు.

పోస్టుల భర్తీకి సంబంధించి ప్రభుత్వం అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ విధానంలో ఈ పోస్టులను భర్తీ చేసే ముందు కచ్చితంగా ఆర్థిక శాఖ అనుమతి తీసుకోవాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో నిర్మిస్తున్న ఈ ఆసుపత్రి అందుబాటులోకి వస్తే చుట్టుపక్కల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందనున్నాయి.

ఈ వార్తపై మీ స్పందన?

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp