
హైదరాబాద్, సూర్య న్యూస్ : సోషల్ మీడియాలో తనపై నిరంతరం వస్తున్న ట్రోల్స్‌పై టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) తనదైన శైలిలో ఘాటుగా స్పందించారు. తన వ్యక్తిత్వంపై విమర్శలు చేసేవారికి దిమ్మతిరిగే సమాధానం ఇస్తూ ఆయన చేసిన తాజా వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
తన కలలు, పడుతున్న శ్రమ ఇతరులకు అనవసరంగా అనిపిస్తే తాను ఆగిపోవాలా అని విజయ్ ప్రశ్నించారు. తనలోని నిజాయతీ, నిబద్ధత చూసి కొందరు దానిని అహంకారంగా భావిస్తే తాను నటించడం మానేయాలా అంటూ మండిపడ్డారు. తనలో ఉన్న ఆత్మవిశ్వాసం ఇతరులకు బలుపులా కనిపిస్తే తాను ఎందుకు తగ్గాలని ఆయన సూటిగా నిలదీశారు.
తన సినీ ప్రయాణాన్ని చూసి ఓర్వలేకపోయే వారికోసం తాను ఇంట్లో కూర్చోలేనని ఆయన స్పష్టం చేశారు. “నేను ఎప్పటికీ మారను.. వాళ్లే మారాలి” అంటూ ట్రోలర్స్‌కు విజయ్ గట్టి కౌంటర్ ఇచ్చారు. ఈ వ్యాఖ్యలతో తన ఆటిట్యూడ్‌పై వస్తున్న విమర్శలకు ఆయన చెక్ పెట్టే ప్రయత్నం చేశారు.
ఈ వార్తపై మీ స్పందన?

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



