
చెన్నై, సూర్య న్యూస్ : తమిళనాడు ఉప ఎన్నికల్లో (Tamil Nadu Bypolls) సినీ నటుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం (TVK Party) సంచలన విజయం సాధించింది. మధురాంతకం, ధారాపురం అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో టీవీకే అభ్యర్థులు ఘన విజయం సాధించడంతో అసెంబ్లీలో ఆ పార్టీ సంఖ్య 109కి చేరింది.
మధురాంతకం నియోజకవర్గం నుంచి టీవీకే అభ్యర్థిగా బరిలోకి దిగిన మరగతం కుమారవేల్ 74,048 ఓట్లు సాధించారు. అధికార డీఎంకే అభ్యర్థికి 54,008 ఓట్లు రాగా.. టీవీకే అభ్యర్థి 20,040 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు.
అలాగే ధారాపురం స్థానంలో పోటీ చేసిన మరో అభ్యర్థి పి. సత్యభామ 66,841 ఓట్లు సాధించి, తన సమీప డీఎంకే అభ్యర్థిపై 9,471 ఓట్ల తేడాతో విజయం సాధించారు. అక్టోబర్ 6న జరిగిన ఈ ఉప ఎన్నికల పోలింగ్ ఓట్ల లెక్కింపును 9న చేపట్టి అధికారికంగా ఫలితాలు ప్రకటించారు.
ఈ ఇద్దరు నేతలు ఏప్రిల్ 2026లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే అభ్యర్థులుగా ఈ సీట్లలో గెలుపొందారు. ఆ తర్వాత తమ పదవులకు, పార్టీకి రాజీనామా చేసి విజయ్ నేతృత్వంలోని టీవీకేలో చేరారు. దీంతో అనివార్యమైన ఉప ఎన్నికల్లో వారు టీవీకే అభ్యర్థులుగా బరిలోకి దిగి మళ్లీ తమ సత్తా చాటారు.
ఈ వార్తపై మీ స్పందన?

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



