|  
● FLASH NEWS
Flydubai: విమానం కూల్చేయాలనేదే నా ప్లాన్.. కో-పైలట్ సంచలన నిజాలు  •  Jaladhara: ఏపీలో రూ.30 వేల కోట్లతో ‘అమరజీవి జలధార’ లాంచ్  •  EVMs: పేపర్ బ్యాలెట్ కోసం ఢిల్లీలో పోరాటం : కల్వకుంట్ల కవిత  •  Housing: ఏపీలో 3 లక్షల ఇళ్ల నిర్మాణాలకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన  •  Honeytrap: పాక్ కిలేడీ వలలో నేవీ ఉద్యోగి.. అరెస్ట్  • 
Skip to content

Venezuela Earthquake: వెనిజులాను వణికించిన ప్రళయం.. భూకంపం వచ్చే ముందే గూగుల్ ఎలా అలర్ట్ చేసిందో తెలిస్తే షాకవుతారు!

కరాకస్, సూర్య న్యూస్: వెనిజులా (Venezuela) దేశాన్ని ఒకేసారి రెండు శక్తివంతమైన భూకంపాలు (Earthquakes) అల్లాడించాయి. రిక్టర్ స్కేలుపై ఈ భూకంప తీవ్రతలు 7.1, 7.5గా నమోదయ్యాయి.​ భూకంపనల ధాటికి భారీ భవనాలు ఒక్కసారిగా పేకమేడల్లా కూలిపోయాయి. గత శతాబ్ద కాలంలో సంభవించిన అత్యంత ఘోరమైన భూకంపాలు తమ దేశంలో ఇవేనని అక్కడి నిపుణులు చెబుతున్నారు.

అయితే ఈ విపత్తు వేళ మరో అత్యంత ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. భూకంపనలు భూమి పైభాగానికి తగలడానికి కొన్ని సెకన్ల ముందే ప్రజల ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్లకు (Android Smartphones) గూగుల్ (Google) నుంచి భూకంప హెచ్చరిక (Earthquake Alert) అందింది. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్లను పలువురు వినియోగదారులు సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఇవి వైరల్ అయ్యాయి.

భూకంపం రాకముందే గూగుల్ దీనిని ఎలా పసిగట్టగలిగిందనే ప్రశ్న ప్రస్తుతం అందరిలోనూ ఆసక్తిని రేపుతోంది. మనం వాడే స్మార్ట్‌ఫోన్లలో అక్సెలెరోమీటర్ (Accelerometer) సెన్సార్ ఉంటుంది. సాధారణంగా ఇది స్క్రీన్‌ను ఆటోమేటిక్‌గా రోటెట్ చేయడానికి ఉపయోగపడుతుంది.

అదేవిధంగా భూమిలో వచ్చే సూక్ష్మమైన వైబ్రేషన్లను కూడా ఈ సెన్సార్ గుర్తించగలదు. ప్రపంచంలో ఎక్కడ భూమి కంపించినా ఆ ప్రాంతంలోని ఆండ్రాయిడ్ ఫోన్లలోని అక్సెలెరోమీటర్ సెన్సార్లు ఆ వైబ్రేషన్‌ను గుర్తిస్తాయి. వెంటనే ఆ సమాచారాన్ని గూగుల్ ఆండ్రాయిడ్ ఎర్త్‌క్వేక్ అలర్ట్స్ సిస్టమ్ (Android Earthquake Alerts System) సర్వర్‌కు పంపుతాయి. అక్కడి నుంచి క్షణాల వ్యవధిలో ఆటోమేటిక్‌గా యూజర్లకు ఎర్త్‌క్వేక్ అలర్ట్ వెళ్తుంది.

ఈ వార్తపై మీ స్పందన?

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp