|  
● FLASH NEWS
Jaladhara: ఏపీలో రూ.30 వేల కోట్లతో ‘అమరజీవి జలధార’ లాంచ్  •  EVMs: పేపర్ బ్యాలెట్ కోసం ఢిల్లీలో పోరాటం : కల్వకుంట్ల కవిత  •  Housing: ఏపీలో 3 లక్షల ఇళ్ల నిర్మాణాలకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన  •  Honeytrap: పాక్ కిలేడీ వలలో నేవీ ఉద్యోగి.. అరెస్ట్  •  INDvsWI: సిరీస్ విండీస్ వశం.. కేఎల్ రాహుల్ అరుదైన రికార్డు  • 
Skip to content

BRAOU PG Admissions 2026 : పీజీ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఇకపై హైదరాబాద్‌లోనే కాదు అక్కడ కూడా కొత్త కోర్సులు.. ఎక్కడంటే?

హైదరాబాద్, సూర్య న్యూస్: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం (Dr. B.R. Ambedkar Open University) లో 2026-27 విద్యా సంవత్సరానికి గానూ డిగ్రీ, పీజీ అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు అధికారులు ఒక అదిరిపోయే శుభవార్తను ప్రకటించారు. ఇప్పటివరకు ఈ పీజీ కోర్సులు చదవాలంటే దూరప్రాంతాల విద్యార్థులు హైదరాబాద్ కు మాత్రమే రావాల్సిన పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు ఆ ఇబ్బందిని పూర్తిగా తొలగిస్తూ మరో చోట కూడా నూతనంగా పీజీ సైన్స్ కోర్సులను (PG Science Courses) అందుబాటులోకి తీసుకువచ్చారు.

మొదటిసారిగా సిద్దిపేట (Siddipet) ప్రాంతీయ సమన్వయ కేంద్రం (RCC 015) లో కూడా పీజీ సైన్స్ కోర్సులను ప్రారంభించారు. గత 40 ఏళ్ల సిద్దిపేట రీజనల్ సెంటర్ చరిత్రలో తొలిసారిగా ఎంఎస్సీ సైన్స్ (M.Sc Science) విభాగంలో కోర్సులను తీసుకురావడం విశేషం. ఈ నూతన కోర్సులకు సంబంధించిన ప్రచార పత్రాలను సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అధికారికంగా విడుదల చేశారు. నూతనంగా ఎంఎస్సీ బాటనీ (M.Sc Botany), ఎంఎస్సీ జువాలజీ (M.Sc Zoology), ఎంఎస్సీ కెమిస్ట్రీ (M.Sc Chemistry), ఎంఎస్సీ ఫిజిక్స్ (M.Sc Physics) కోర్సులను ఇక్కడ ప్రవేశపెట్టారు.

​యూజీసీ (UGC) గుర్తింపు పొందిన ఈ విశ్వవిద్యాలయం ద్వారా నాణ్యమైన దూరవిద్యను ఇక్కడ అందించనున్నారు. ఉద్యోగాలు చేస్తున్నవారు, గృహిణులు, గ్రామీణ విద్యార్థులకు ఈ సైన్స్ కోర్సులు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. అనుభవజ్ఞులైన అధ్యాపకుల బోధన, అందుబాటులో ఉండే ఫీజులతో నాణ్యమైన విద్యా విధానాన్ని అందిస్తున్నట్లు రీజనల్ కోఆర్డినేటర్ డాక్టర్ ఎం. శ్రద్ధానందం, సిద్దిపేట డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జి. సునీత తెలిపారు. ఈ ప్రతిష్టాత్మక కోర్సులను సిద్దిపేట కేంద్రానికి మంజూరు చేసినందుకు గానూ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ (Vice Chancellor) ప్రొఫెసర్ ఘంటా చక్రపాణికి వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల పూర్వ ప్రిన్సిపాల్ డాక్టర్ జి. పాపయ్య, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ పి. అయోధ్య రెడ్డి, పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ గోపాల సుదర్శనం పాల్గొన్నారు.

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో 2026-27 విద్యా సంవత్సరానికి గానూ నూతన అడ్మిషన్లు (Admissions Open) కొనసాగుతున్నాయి. ఈ అడ్మిషన్లకు సంబంధించిన పూర్తి వివరాల కోసం అభ్యర్థులు www.braou.ac.in అధికారిక వెబ్ సైట్ ను సందర్శించవచ్చు. ఏవైనా సందేహాలు ఉంటే నేరుగా 7382929615, 9704425028 నంబర్లను సంప్రదించి వివరాలు తెలుసుకోవచ్చని అధికారులు సూచించారు.

ఈ వార్తపై మీ స్పందన?

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp