|  
FLASH NEWS
YouTuber Nandus World Rama Nandana : యూట్యూబర్ రమా నందన అరెస్ట్.. లండన్ వీసా స్కామ్‌లో దిమ్మతిరిగే నిజాలు  •  నిరుద్యోగ యువతకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మోసం.. ఉద్యోగాల భర్తీకి ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం డిమాండ్  •  AP Politics : వైసీపీకి చిన్న శ్రీను రాజీనామా.. కీలక పదవులకు గుడ్‌బై  •  India vs Afghanistan : పాక్ ఆక్రమిత కాశ్మీర్‌ను భారత మ్యాప్‌లో చూపిన అఫ్గానిస్తాన్.. మండిపడుతున్న పీసీబీ  •  YouTuber Nandana : నిరుద్యోగులకు భారీ టోకరా.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో పట్టుబడిన ప్రముఖ యూట్యూబర్  • 
Skip to content

Nagarjuna King 100 : ‘కింగ్ 100’ అనుకుంటే ‘పళ్ళబురుసు’ ఇచ్చాడేంటి.. ప్రేక్షకులను భలే బురిడీ కొట్టించిన నాగార్జున

Hyderabad, Surya News: టాలీవుడ్ కింగ్ నాగార్జున (Nagarjuna) తన అభిమానులను క్యూరియాసిటీతో ఊరించి చివరకి భలే బురిడీ కొట్టించారు. అన్నపూర్ణ స్టూడియోస్ (Annapurna Studios) బ్యానర్ నుంచి తాజాగా ఒక ప్రీ లుక్ పోస్టర్ రాగానే అందరూ అది ‘కింగ్ 100’ (King 100) సినిమా అప్డేట్ అని ఆశపడ్డారు. టైటిల్ టీజర్ అంటూ సోషల్ మీడియాలో అనౌన్స్మెంట్ చేయగానే నెట్టింట్లో వందవ సినిమా వార్తలతో హోరెత్తింది. కానీ అసలు విషయం తెలిసి అభిమానులు నవ్వుకుంటున్నారు. ఈ అప్డేట్ నాగార్జున 100వ సినిమాకు సంబంధించినది కాదని తేలిపోయింది.

అన్నపూర్ణ స్టూడియోస్, ఎపిక్ స్టూడియోస్ (EPIC Studios) సంయుక్తంగా నిర్మిస్తున్న ఒక వినూత్న చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ఇది. ఈ సినిమాకి మేకర్స్ ‘పళ్ళబురుసు’ (Pallaburusu) అనే టైటిల్ ఖరారు చేస్తూ పోస్టర్ విడుదల చేశారు. ఈ వినోదభరితమైన ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మరో బలగం తరహాలో గ్రామీణ వాతావరణం, తెలుగు సంస్కృతిని ప్రతిబింబించే కామెడీ డ్రామాగా ఈ చిత్రం రాబోతున్నట్లు తెలుస్తోంది.

ఈ ‘పళ్ళబురుసు’ ఫస్ట్ లుక్ లో జిల్లా కోర్టు ఆవరణలో ఒక పెద్ద టూత్ బ్రష్ ను త్రాసులా రూపొందించారు. దానిపై సుధాకర్ రెడ్డి (Sudhakar Reddy), మురళీధర్ గౌడ్ (Muralidhar Goud) వెన్ను వెన్ను ఆనుకుని కూర్చున్న దృశ్యం ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో వీరిద్దరూ తండ్రీకొడుకులుగా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అలాగే ప్రజ్వల్, గోమతి రెడ్డి, కిరణ్ మాచా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాకు ఉదయ్ చౌహాన్ (Uday Chauhan) కథ, దర్శకత్వం వహిస్తున్నారు.

కింగ్ సినిమా అప్డేట్ కోసం ఎదురుచూసిన ఫ్యాన్స్ కు టూత్ బ్రష్ తో దిమ్మతిరిగే షాక్ ఇచ్చి మేకర్స్ మంచి పబ్లిసిటీ సాధించారు. వినూత్నమైన కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని 2026 ఆగస్టు 14న (August 14) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. మొత్తానికి ఎలాంటి హడావిడి లేకుండా నాగార్జున తన మార్క్ కామెడీతో జనాలను బాగానే ఏమార్చారు.

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp