|  
FLASH NEWS
నిరుద్యోగ యువతకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మోసం.. ఉద్యోగాల భర్తీకి ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం డిమాండ్  •  AP Politics : వైసీపీకి చిన్న శ్రీను రాజీనామా.. కీలక పదవులకు గుడ్‌బై  •  India vs Afghanistan : పాక్ ఆక్రమిత కాశ్మీర్‌ను భారత మ్యాప్‌లో చూపిన అఫ్గానిస్తాన్.. మండిపడుతున్న పీసీబీ  •  YouTuber Nandana : నిరుద్యోగులకు భారీ టోకరా.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో పట్టుబడిన ప్రముఖ యూట్యూబర్  •  Telangana Assembly : నా చీర లాగారు.. అసెంబ్లీ వద్ద కన్నీళ్లు పెట్టుకున్న సునీతా లక్ష్మారెడ్డి  • 
Skip to content

NBK 111 Shooting : కాకినాడ పోర్టులో షూటింగ్.. నందమూరి బాలకృష్ణకు ప్రమాదం..

కాకినాడ, సూర్య న్యూస్ : సినీ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) షూటింగ్ లో గాయపడ్డారు. దర్శకుడు గోపీచంద్ మలినేని (Gopichand Malineni) దర్శకత్వంలో తెరకెక్కుతున్న #NBK111 సినిమా షూటింగ్ ప్రస్తుతం కాకినాడ పోర్టులో (Kakinada Port) జరుగుతోంది. ఈ చిత్రంలో నటుడు మంచు మనోజ్ (Manchu Manoj), బాలకృష్ణ మధ్య ఒక కీలక యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

​షూటింగ్ జరుగుతున్న సమయంలో బాలకృష్ణ ప్రమాదవశాత్తు జారిపడ్డారు. దీంతో ఆయన మోకాలికి స్వల్ప గాయం అయింది. వెంటనే అప్రమత్తమైన చిత్ర బృందం షూటింగ్ ను నిలిపివేసింది. వైద్యులు ఆయనకు ప్రాథమిక చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం దగ్గర్లోని ఆసుపత్రికి తరలించి స్కానింగ్ చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన కాకినాడ పోర్టులోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp