|  
● FLASH NEWS
Supreme Court: సుప్రీంకోర్టు జడ్జిగా తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్?  •  Deal: పరస్పర సుంకాల తగ్గింపునకు అమెరికా-చైనా అంగీకారం  •  Strike: బ్యాంకుల సమ్మె వాయిదా.. యూనియన్లపై ఉద్యోగుల ఆగ్రహం  •  Kohli: కోహ్లీ–గిల్ సెంచరీలు.. వెస్టిండీస్‌పై టీమిండియా ఘన విజయం  •  CEC: దేశద్రోహి జ్ఞానేశ్ కుమార్‌ను వెంటనే అరెస్ట్ చేయాలి.. కాంగ్రెస్ డిమాండ్  • 
Skip to content

Quthbullapur News : శ్రీరామ్ నగర్ ఎల్లమ్మ పోచమ్మ కళ్యాణోత్సవం.. ప్రత్యేక పూజలు నిర్వహించిన కాంగ్రెస్ నేత పున్నారెడ్డి

కుత్బుల్లాపూర్, సూర్య న్యూస్ : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం (Quthbullapur Constituency) పరిధిలోని రోడ్డ మేస్త్రి నగర్ లో గల శ్రీరామ్ నగర్ ‘బి’ లో శ్రీ శ్రీ ఎల్లమ్మ పోచమ్మ అమ్మవార్ల కళ్యాణ మహోత్సవం (Kalyana Mahotsavam) భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగింది. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మాజీ టీపీసీసీ (TPCC) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు కాంగ్రెస్ (Congress) పార్టీ సీనియర్ నాయకులు సొంటిరెడ్డి పున్నారెడ్డి (Sontireddy Punna Reddy) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు, స్థానిక నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు.

​ఈ సందర్భంగా సొంటిరెడ్డి పున్నారెడ్డి మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ప్రజలు మరియు ప్రతి కుటుంబం ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆయన కోరుకున్నారు. అందరూ సుఖసంతోషాలతో, అష్టైశ్వర్యాలతో అభివృద్ధి చెందాలని అమ్మవారిని మనసారా ప్రార్థించినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు, స్థానికులు మరియు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు.

ఈ వార్తపై మీ స్పందన?

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp