|  
● FLASH NEWS
Deal: పరస్పర సుంకాల తగ్గింపునకు అమెరికా-చైనా అంగీకారం  •  Strike: బ్యాంకుల సమ్మె వాయిదా.. యూనియన్లపై ఉద్యోగుల ఆగ్రహం  •  Kohli: కోహ్లీ–గిల్ సెంచరీలు.. వెస్టిండీస్‌పై టీమిండియా ఘన విజయం  •  CEC: దేశద్రోహి జ్ఞానేశ్ కుమార్‌ను వెంటనే అరెస్ట్ చేయాలి.. కాంగ్రెస్ డిమాండ్  •  Marathon: 44 ఏళ్ల నిరీక్షణకు తెర.. ఏషియన్ గేమ్స్‌లో భారత్‌కు చారిత్రక రజతం  • 
Skip to content

Strike: బ్యాంకుల సమ్మె వాయిదా.. యూనియన్లపై ఉద్యోగుల ఆగ్రహం

న్యూఢిల్లీ, సూర్య న్యూస్ : ప్రభుత్వ రంగ బ్యాంకుల ఉద్యోగులు సోమవారం నుంచి తలపెట్టిన మూడు రోజుల సమ్మె (Bank Strike) అనూహ్యంగా వాయిదా పడింది. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ మరియు యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU) మధ్య జరిగిన చర్చల అనంతరం సమ్మెను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించడంతో సామాన్య ఉద్యోగులు యూనియన్ల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

వారానికి ఐదు రోజుల పనిదినాలు అమలు చేయాలన్న ప్రధాన డిమాండ్‌తో సెప్టెంబర్ 28, 29, 30 తేదీల్లో దేశవ్యాప్తంగా సమ్మెకు బ్యాంకర్లు పిలుపునిచ్చారు. అయితే, సమస్యల పరిష్కారానికి ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని ఐబీఏ, యూఎఫ్బీయూ తాజా సమావేశంలో నిర్ణయించాయి. ఈ హామీతో సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు యూనియన్లు వెల్లడించాయి.

‘బ్లాక్ సండే’ నిరసన.. ఆపై వాయిదా

సమ్మె కారణంగా బ్యాంకింగ్ సేవలకు అంతరాయం కలగకుండా ఉండేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశాలతో ఆదివారం (సెప్టెంబర్ 27) కూడా బ్యాంకులు పనిచేశాయి. కేంద్ర ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా ఉద్యోగులు నిన్న నల్ల రంగు దుస్తులు ధరించి ‘బ్లాక్ సండే’ పేరుతో విధులకు హాజరయ్యారు. ఐదు రోజుల పని విధానంపై ప్రభుత్వం గతంలో అంగీకారం తెలిపినా ఇంకా అమలు చేయకపోవడంపై వారు తీవ్ర విమర్శలు గుప్పించారు.

యూనియన్ల నిర్ణయంపై భగ్గుమంటున్న ఉద్యోగులు

సమ్మె వాయిదా నిర్ణయంపై కింది స్థాయి ఉద్యోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఐదు రోజుల పనిదినాలపై ఎలాంటి స్పష్టమైన హామీ రాకుండానే సమ్మెను వాయిదా వేయడం తమకు వెన్నుపోటు పొడవడమేనని యూనియన్లపై మండిపడుతున్నారు. సమ్మె ఉంటుందనే ఉద్దేశంతోనే ఆదివారం సెలవు రోజున కూడా తమతో డ్యూటీ చేయించారని, ఇప్పుడు సమ్మె రద్దు కావడంతో నిన్న పనిచేసినందుకు అదనపు వేతనం లేదా క్యాజువల్ లీవ్ (CL) ఇస్తారా అని వారు ప్రశ్నిస్తున్నారు.

ఈ వార్తపై మీ స్పందన?

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp