
ఢిల్లీ, సూర్య న్యూస్ : భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్‌పై కేరళ మాజీ సీఎస్ జిజి థామస్ చేసిన సంచలన ఆరోపణలు దేశ రాజకీయాల్లో పెను దుమారం రేపుతున్నాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో తనను బీజేపీ (BJP) టికెట్‌పై పోటీ చేయాలని జ్ఞానేశ్ కుమార్ గతంలో సూచించారంటూ థామస్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో మండిపడింది.
గతంలో ఐఏఎస్ అధికారిగా బీజేపీకి మద్దతుగా వ్యవహరించిన ఆయన.. ఇప్పుడు సీఈసీగా నిష్పక్షపాతంగా ఎన్నికలు ఎలా నిర్వహిస్తారని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించింది. ప్రజాస్వామ్యానికి ముప్పుగా మారిన ఈ దేశద్రోహిని వెంటనే అరెస్ట్ చేయాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. ఇదే విషయంపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పందిస్తూ.. రాబోయే ఎన్నికల్లో మ్యాచ్ ఫిక్సింగ్ కోసమే ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా కలిసి జ్ఞానేశ్ కుమార్‌ను అంపైర్‌గా నియమించారని తీవ్ర విమర్శలు చేశారు.
మరోవైపు ఈ వ్యవహారంపై సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సీజేపి ఫౌండర్ అభిజీత్ డిప్సే సైతం ఎక్స్ (X) వేదికగా సీఈసీపై సెటైర్లు వేశారు. 2019 ఎన్నికల్లో పతనంతిట్ట నుంచి బీజేపీ తరఫున పోటీ చేయాలని జిజి థామస్‌కు జ్ఞానేశ్ కుమార్ సూచించినట్లు ఉన్న వార్తా కథనాన్ని ఆయన షేర్ చేశారు. బీజేపీకి అనుకూలంగా పనిచేసిన ఈ వ్యక్తి.. ఇప్పుడు ఎన్నికలను ఎంతో పారదర్శకంగా నిర్వహిస్తారు, గ్రేట్ అంటూ ఆయన ఎద్దేవా చేస్తూ క్యాప్షన్ ఇచ్చారు.
జ్ఞానేశ్ కుమార్ తక్షణం తన పదవికి రాజీనామా చేయాలని విపక్షాలు పట్టుబడుతున్నాయి. అత్యున్నత రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తి అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు రావడం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ తీవ్ర ఆరోపణలపై అటు ఎన్నికల సంఘం కానీ, ఇటు కేంద్ర ప్రభుత్వం కానీ అధికారికంగా ఎలా స్పందిస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ఈ వార్తపై మీ స్పందన?

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



