|   
🔴 BREAKING NEWS ► Trainee IPS Case : సీపీ సజ్జనార్‌పై సంచలన ఆరోపణలు.. ఎన్‌కౌంటర్ చేస్తానని బెదిరించారంటూ ట్రైనీ ఐపీఎస్ ఫిర్యాదు! UPI Transaction Charges : యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు.. సామాన్యులపై భారం పడుతుందా? నిర్మలా సీతారామన్ క్లారిటీ ఇదే! Thalapathy Vijay Divorce : సీఎం విజయ్‌కు ఊరట.. విడాకుల పిటిషన్ వెనక్కి తీసుకున్న భార్య సంగీత IRCTC Sapta Jyotirlinga Yatra : ఒక్క ట్రిప్‌లోనే 7 జ్యోతిర్లింగాల దర్శనం.. ఐఆర్‌సిటిసి ప్రత్యేక భారత్ గౌరవ్ టూర్ ప్యాకేజీ వివరాలు ఇవే AP Weather Alert : ఏపీకి భారీ వర్ష సూచన.. ఆ జిల్లాల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలి
Skip to content

UPI Payments Free : యూపీఐ పేమెంట్స్ పై వినియోగదారులకు గుడ్ న్యూస్.. ఫోన్‌పే సీఈఓ సమీర్ నిగమ్ కీలక ప్రకటన

హైదరాబాద్, సూర్య న్యూస్:దేశవ్యాప్తంగా కోట్ల మంది వినియోగిస్తున్న యూపీఐ (UPI) చెల్లింపులపై ఫోన్‌పే (PhonePe) సీఈఓ సమీర్ నిగమ్ కీలక ప్రకటన చేశారు. డిజిటల్ లావాదేవీలపై ఎలాంటి అదనపు రుసుము వసూలు చేయబోమని ఆయన స్పష్టం చేశారు. భారతీయ వినియోగదారులకు యూపీఐ సేవలు ఎప్పటికీ ఉచితంగానే అందుబాటులో ఉంటాయని ఆయన భరోసా ఇచ్చారు.

ఇటీవల యూపీఐ లావాదేవీల (UPI Transactions) ఛార్జీల వసూలుకు సంబంధించిన బిల్లు లోక్‌సభలో ప్రస్తావనకు వచ్చింది. దీంతో సాధారణ వినియోగదారుల్లో తమ పేమెంట్స్ పై ఛార్జీలు పడతాయనే ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో యూజర్లకు ఎలాంటి ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం ఉండదని ఫోన్‌పే సహ వ్యవస్థాపకుడు (Co-founder) సమీర్ నిగమ్ తెలిపారు. యూపీఐ వ్యవస్థను సాధారణ ప్రజలకు అందుబాటులో ఉండేలా ఉచితంగా కొనసాగించడం అత్యంత ముఖ్యమని ఆయన పేర్కొన్నారు.

Surya News Logo
మరిన్ని బ్రేకింగ్ వార్తల కోసం
Surya News WhatsApp Channel లో జాయిన్ అవ్వండి
Join

యూపీఐ లావాదేవీలపై ఎండీఆర్ (MDR) విధించేందుకు చట్టపరమైన మార్పులపై ప్రస్తుతం చర్చ జరుగుతోంది. అయితే దీనిపై తుది విధానం ఇంకా ఖరారు కాలేదు. పేమెంట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (PCI) కూడా ఈ విషయంపై స్పష్టత ఇచ్చింది. యూపీఐ ద్వారా చెల్లింపులు చేసే సాధారణ వినియోగదారులకు ఎలాంటి ఛార్జీలు ఉండవని తెలిపింది. అలాగే చిన్న దుకాణాలు, కిరాణా వ్యాపారులు సైతం యూపీఐ చెల్లింపులు స్వీకరించడానికి ఎలాంటి మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR Rate) చెల్లించాల్సిన అవసరం లేదని పేమెంట్స్ కౌన్సిల్ స్పష్టం చేసింది.

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp