|  
● FLASH NEWS
Jaladhara: ఏపీలో రూ.30 వేల కోట్లతో ‘అమరజీవి జలధార’ లాంచ్  •  EVMs: పేపర్ బ్యాలెట్ కోసం ఢిల్లీలో పోరాటం : కల్వకుంట్ల కవిత  •  Housing: ఏపీలో 3 లక్షల ఇళ్ల నిర్మాణాలకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన  •  Honeytrap: పాక్ కిలేడీ వలలో నేవీ ఉద్యోగి.. అరెస్ట్  •  INDvsWI: సిరీస్ విండీస్ వశం.. కేఎల్ రాహుల్ అరుదైన రికార్డు  • 
Skip to content

Telugu Film Federation : జానీ మాస్టర్‌కు ఫిల్మ్ ఫెడరేషన్ భారీ షాక్.. మళ్లీ సస్పెన్షన్ వేటు!

హైదరాబాద్, సూర్య న్యూస్: టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ (Choreographer Jani Master) చుట్టూ వివాదాల ముసురు వీడటం లేదు. డాన్సర్స్ యూనియన్‌లో చెలరేగిన అంతర్గత విబేధాలు, శేఖర్ మాస్టర్‌తో వివాదం నేపథ్యంలో తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ పరిధిలోని తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ (Telugu Film Federation) సంచలన నిర్ణయం తీసుకుంది. గతంలో ఎత్తివేసిన జానీ మాస్టర్ సస్పెన్షన్‌ను తిరిగి పునరుద్ధరిస్తున్నట్లు ఫెడరేషన్ అధికారికంగా ప్రకటించింది.

ఈ వ్యవహారంపై చర్చించేందుకు ఫెడరేషన్ ప్రెసిడెంట్ అనిల్ వల్లభనేని ఆధ్వర్యంలో మిగతా 23 క్రాఫ్ట్స్ ప్రతినిధులతో అత్యవసర జనరల్ కౌన్సిల్ భేటీ నిర్వహించారు. ఫెడరేషన్‌తో కలిసి పనిచేస్తానని గతంలో లిఖితపూర్వక హామీ ఇచ్చిన జానీ మాస్టర్, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడం వల్లే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఫెడరేషన్ స్పష్టం చేసింది.

మరోవైపు మెగాస్టార్ చిరంజీవి, నిర్మాతల మండలి పెద్దల మాటలను ఖాతరు చేయకుండా డాన్సర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సుమలత ఏకపక్షంగా నిర్వహించిన ఉప ఎన్నికలను ఫెడరేషన్ తీవ్రంగా ఆక్షేపించింది. ఆ ఎన్నికల ద్వారా ఏర్పడిన నూతన కార్యవర్గానికి సహకరించేది లేదని, అయితే సాధారణ డ్యాన్సర్లు ఆశ్రయిస్తే పూర్తి మద్దతు ఇస్తామని స్పష్టం చేసింది. తాజా సస్పెన్షన్‌తో టాలీవుడ్‌లో జానీ మాస్టర్ భవిష్యత్ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ఈ వార్తపై మీ స్పందన?

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp