|   
🔴 BREAKING NEWS ► Kukatpally News : రాష్ట్ర స్థాయి అవార్డులు కొల్లగొట్టిన కూకట్‌పల్లి జర్నలిస్టులు – ఘనంగా సన్మానించిన TWJF TTD Fake Websites Alert : తిరుమల భక్తులకు టీటీడీ బిగ్ అలర్ట్.. ఆ లింక్స్ క్లిక్ చేస్తే డబ్బులు గోవిందా Telangana Police Jobs Age Limit : తెలంగాణ పోలీసు అభ్యర్థులకు గుడ్ న్యూస్.. పెరిగిన వయోపరిమితి (Age Limit).. పూర్తి వివరాలు ఇవే Teenmar Mallanna : తెలంగాణలో రెడ్ల విగ్రహాలు కూలగొడతాం.. రాబోయేది బీసీల రాజ్యమే అంటున్న తీన్మార్ మల్లన్న? Rega Kantha Rao Arrest : బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు అరెస్ట్.. లైంగిక ఆరోపణల కేసులో పోలీసుల అదుపులో
Skip to content

ED Interrogates Nidhhi Agerwal : బెట్టింగ్ యాప్స్ కేసులో నిధి అగర్వాల్‌కు ఈడీ షాక్.. 4 గంటల పాటు ప్రశ్నల వర్షం!

హైదరాబాద్, సూర్య న్యూస్: టాలీవుడ్ ప్రముఖ కథానాయిక నిధి అగర్వాల్ (Heroine Nidhhi Agerwal) చుట్టూ ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ వివాదం ముదిరింది. చట్టవిరుద్ధమైన బెట్టింగ్, ఆన్‌లైన్ గేమింగ్ ప్లాట్‌ఫారమ్‌ల ప్రమోషన్ల వ్యవహారంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate – ED) హైదరాబాద్‌లోని తన ప్రాంతీయ కార్యాలయంలో ఆమెను సుదీర్ఘంగా విచారించింది.

ప్రముఖ బెట్టింగ్ యాప్ ‘జీత్ విన్’ (JeetWin) సహా పలు వివాదాస్పద గేమింగ్ ప్లాట్‌ఫారమ్‌లకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించడం, ప్రమోషనల్ యాడ్స్‌లో నటించడంపై అధికారులు ప్రధానంగా దృష్టి సారించారు. ఈ ప్రచారాల కోసం యాప్ నిర్వాహకులతో చేసుకున్న ఒప్పందాలు, అందుకుగాను ఆమె అందుకున్న భారీ రెమ్యునరేషన్ లావాదేవీలు, నిధుల బదిలీ మార్గాలపై ఈడీ అధికారులు లోతుగా వివరాలు సేకరించారు.

దాదాపు నాలుగు గంటల పాటు సాగిన ఈ సుదీర్ఘ విచారణ అనంతరం ఆమె కార్యాలయం నుంచి బయటకు వచ్చారు. అక్కడ వేచి ఉన్న మీడియాతో ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా నిరాకరిస్తూ ఆమె నేరుగా కారులో వెళ్లిపోయారు. ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్‌ను బాధ్యతారాహిత్యంగా ప్రమోట్ చేస్తున్న సినీ ప్రముఖులపై దర్యాప్తు సంస్థలు కొరడా ఝుళిపిస్తున్న క్రమంలో నిధి అగర్వాల్ ఈడీ విచారణకు హాజరుకావడం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp