|  
FLASH NEWS
మంత్రి కొండా సురేఖ వ్యవహారంలో ఊహించని మలుపు.. మద్దతుగా నిలిచిన కీలక నేతలు!  •  ఆర్టీసీ కార్గో ప్రైవేట్ చేతికి.. 10-15 ఏళ్ల ఒప్పందం, ఛార్జీలపై ఆందోళన  •  గొల్లగుప్ప గ్రామస్థుల అస్వస్థత ఘటనపై సీఎం ఆరా.. సమగ్ర విచారణకు ఆదేశాలు  •  పశ్చిమ బెంగాల్‌లో విషాదం.. అనుమానాస్పద స్థితిలో మమతా బెనర్జీ మేనకోడలు మృతి  •  దేశ రాజధానిలో మరో నిర్భయ తరహా దారుణం.. కదులుతున్న బస్సులో 47 కిలోమీటర్ల మేర మైనర్‌పై రాక్షసత్వం!  • 
Skip to content

క్రికెట్ ప్రపంచంలో వైభవ్ సూర్యవంశీ సరికొత్త చరిత్ర.. రికార్డుల రారాజుపై బీసీసీఐ ప్రశంసలు

టీ20లు, లిస్ట్-ఏ క్రికెట్‌లో అత్యంత పిన్న వయసులోనే సెంచరీలు సాధించిన కుర్రాడు. కేవలం 11 బంతుల్లోనే లిస్ట్-ఏ హాఫ్ సెంచరీతో అరుదైన రికార్డు.

Vaibhav suryavansi new records
Vaibhav suryavansi new records

భారత యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ క్రికెట్ ప్రపంచంలో సరికొత్త సంచలనంగా మారాడు. అతి పిన్న వయసులోనే వరుస రికార్డులు బద్దలు కొడుతున్న ఈ కుర్రాడిని భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ప్రత్యేకంగా అభినందించింది. అతడిని ‘హిస్టరీ మేకర్’, ‘రికార్డ్ బ్రేకర్’గా అభివర్ణిస్తూ బీసీసీఐ తాజాగా తన అధికారిక ఖాతాలో ట్వీట్ చేసింది.

టీ20, లిస్ట్-ఏ ఫార్మాట్లలో అరుదైన రికార్డులు

టీ20 ఫార్మాట్‌లో కేవలం 14 ఏళ్ల 32 రోజుల వయసులోనే సెంచరీ సాధించిన వైభవ్.. అత్యంత చిన్న వయసులో ఈ ఘనత సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. అలాగే, లిస్ట్-ఏ క్రికెట్‌లో 14 ఏళ్ల 272 రోజుల వయసులో సెంచరీ నమోదు చేసి తన సత్తా చాటాడు. అంతేకాకుండా, లిస్ట్-ఏ లో కేవలం 11 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించి ఫాస్టెస్ట్ ఫిఫ్టీ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.

యంగెస్ట్ అరంగేట్రం

జాతీయ జట్టు తరపున కూడా వైభవ్ సూర్యవంశీ అతి చిన్న వయసులోనే తన మార్క్ చూపించాడు. 15 ఏళ్ల 99 రోజుల వయసులో భారత్ తరఫున అరంగేట్రం చేసిన అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డులకెక్కాడు. అంతర్జాతీయ టీ20ల్లో 15 ఏళ్ల 118 రోజులకు, దేశవాళీ టోర్నీ దులీప్ ట్రోఫీలో 15 ఏళ్ల 157 రోజులకు హాఫ్ సెంచరీలు సాధించి ఈ ఘనత అందుకున్న యంగెస్ట్ ప్లేయర్‌గా చరిత్ర పుటల్లో నిలిచాడు.

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp