
హైదరాబాద్, సూర్య న్యూస్ : టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma) అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఆఫ్ఘనిస్థాన్‌తో జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్‌లో (T20 Match) కేవలం 30 బంతుల్లోనే సెంచరీ సాధించి అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.
ఐసీసీ పూర్తి స్థాయి సభ్యత్వం ఉన్న జట్ల పరంగా చూసుకుంటే అంతర్జాతీయ టీ20 ఫార్మాట్‌లో ఇదే అత్యంత వేగవంతమైన సెంచరీ కావడం విశేషం. ఇంతకుముందు ఈ రికార్డు న్యూజిలాండ్ ఆటగాడు ఫిన్ అలెన్ పేరిట ఉండేది. అలెన్ 33 బంతుల్లో సెంచరీ సాధించగా, ఇప్పుడు అభిషేక్ శర్మ ఆ రికార్డును బద్దలు కొట్టాడు.
ఈ సంచలన ఇన్నింగ్స్‌లో అభిషేక్ బౌండరీల వర్షం కురిపించాడు. తన సెంచరీ మార్కును చేరుకునే క్రమంలో ఏకంగా పది భారీ సిక్సర్లు, తొమ్మిది ఫోర్లు బాది ఆఫ్ఘన్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. సహచర ఓపెనర్ సంజు శాంసన్‌తో కలిసి భారత జట్టుకు అద్భుతమైన ఆరంభాన్ని అందించాడు.
ఈ వార్తపై మీ స్పందన?

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



