|  
● FLASH NEWS
Raptadu: రాప్తాడు ఉన్మాదిపై పోలీసుల కాల్పులు.. టపాసులు పేల్చి సంబరాలు  •  HMWSSB: హైదరాబాద్‌లో గ్రీన్ వాటర్ ట్యాంకర్ సేవలు ప్రారంభం  •  Jagan: పులివెందుల మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వేయను: వైఎస్ జగన్  •  Ebola: ప్రపంచానికి ఎబోలా ముప్పు.. రెడ్ అలర్ట్‌లో యూరప్!  •  OmarAbdullah: జమ్మూకశ్మీర్ సీఎంపై 24 మంది ఎమ్మెల్యేల తిరుగుబాటు!  • 
Skip to content

AP Minister Nara Lokesh : వినాయక నిమజ్జనాలకు డీజే వాహనాలకు అనుమతి ఇవ్వండి

అమరావతి, సూర్య న్యూస్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వినాయక నిమజ్జన వేడుకల సందర్భంగా డీజే వాహనాలకు (DJ Vehicles) ఎలాంటి ఆంక్షలు లేకుండా అనుమతి ఇవ్వాలని రాష్ట్ర మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) పోలీసు శాఖను కోరారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా హోంమంత్రి అనిత, రాష్ట్ర డీజీపీలకు ప్రత్యేక విజ్ఞప్తి చేశారు.

గణేష్ నిమజ్జనం కోసం డీజేలు ఏర్పాటు చేసుకునేందుకు పోలీసులు కింది స్థాయిలో అనుమతి నిరాకరిస్తున్నారని తన దృష్టికి వచ్చినట్లు మంత్రి తెలిపారు. అనుమతుల కోసం వెళ్లిన వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నారంటూ తనకు అనేక సందేశాలు వస్తున్నాయని ఆయన తన పోస్ట్‌లో పేర్కొన్నారు. పండుగ వాతావరణంలో భక్తులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాల్సిన అవసరం ఉందని ఆయన గుర్తు చేశారు.

ఉత్సవాల సమయంలో ఎవరికీ ఇబ్బందులు కలగకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలని హోంమంత్రిని ఆయన కోరారు. రాష్ట్రంలో ఎక్కడా ఒక్క డీజే వాహనాన్ని కూడా సీజ్ చేయకుండా పోలీసు ఉన్నతాధికారులకు తగిన ఆదేశాలు జారీ చేయాలని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. కింది స్థాయి పోలీసుల తీరుపై భక్తుల నుంచి వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో మంత్రి నేరుగా స్పందించడం గమనార్హం.

ఈ వార్తపై మీ స్పందన?

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp