|  
FLASH NEWS
Disha Salian Case : మాజీ సీఎం కుమారుడికి ఏకంగా రూ.500 కోట్ల లీగల్ నోటీసులు.. అసలేం జరిగిందంటే?  •  Keesara SI ACB Trap : స్టేషన్ బెయిల్ కోసం రూ.5 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఎస్ఐ  •  Dadasaheb Phalke Award 2024 : ‘కేజీఎఫ్’ నటుడికి అత్యున్నత పురస్కారం.. అనంత్ నాగ్‌ను వరించిన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు!  •  CM Revanth Reddy on KCR Farmhouse : కేసీఆర్ ఫామ్‌హౌస్‌పై సీఎం రేవంత్ సంచలన ఆదేశాలు.. ఆ భూములను దళితులకు పంచుతామని ప్రకటన  •  PM Modi Friend : ప్రధాని మోదీని కలిసిన కొద్దిరోజుల్లోనే పరిష్కారం.. దశాబ్దాల భూ వివాదంలో ఆ స్నేహితుడికి ఊరట ఎలా లభించిందో తెలుసా?  • 
Skip to content

Keesara SI ACB Trap : స్టేషన్ బెయిల్ కోసం రూ.5 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఎస్ఐ

హైదరాబాద్, సూర్య న్యూస్ : ఒక కేసులో స్టేషన్ బెయిల్ మంజూరు చేసేందుకు ఏకంగా ఐదు లక్షల రూపాయల లంచం తీసుకుంటూ కీసర సబ్ ఇన్స్పెక్టర్ (Keesara SI) జ్ఞానేందర్ రెడ్డి అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు. కీసర చెరువు వద్ద గణేశ్ నిమజ్జనం బందోబస్తు విధుల్లో ఉన్న ఆయన తన కారులో ఈ లంచం మొత్తాన్ని స్వీకరించారు.

స్టేషన్ బెయిల్ ఇవ్వడం కోసం ఎస్ఐ మొదట పది లక్షల రూపాయలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. బాధితుడితో బేరసారాల అనంతరం చివరికి ఐదు లక్షల రూపాయలకు ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది. ఈ సమాచారం ముందుగానే అందుకున్న అధికారులు వ్యూహాత్మకంగా వ్యవహరించి ఎస్ఐ కారులో డబ్బులు తీసుకుంటున్న సమయంలోనే నేరుగా పట్టుకున్నారు. ఆయన వద్ద ఉన్న నగదును స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఈ అవినీతి వ్యవహారంలో కీసర ఇన్ స్పెక్టర్ ఆర్యపల్లి ఆంజనేయులు పాత్ర కూడా ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై కూడా అధికారులు దృష్టి సారించి లోతైన విచారణ చేపట్టారు. పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ భారీ లంచం బాగోతం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.

ఈ వార్తపై మీ స్పందన?

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp