
ఏలూరు, సూర్య న్యూస్ : మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్ (Alla Nani) అంత్యక్రియల్లో పాల్గొనేందుకు ఏలూరు వచ్చిన రాష్ట్ర మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) ఆయన భౌతికకాయానికి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు ఏలూరు పార్లమెంట్ సభ్యులు పుట్టా మహేశ్ కుమార్ కూడా పాల్గొని అశ్రునివాళులు అర్పించారు.
అనంతరం వారు మీడియాతో సమావేశం నిర్వహించారు. ఆళ్ల నాని మృతి పట్ల ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఈ విషాద సమయంలో ఆళ్ల నాని కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని వారు కోరుకున్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు కొలుసు పార్థసారథి, నిమ్మల రామానాయుడు పాల్గొన్నారు. అలాగే ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మరియు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు అక్కడకు చేరుకున్నారు. ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు తో పాటు పలువురు ఇతర ముఖ్య నాయకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని నివాళులర్పించారు.
ఈ వార్తపై మీ స్పందన?

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



