|  
FLASH NEWS
AP Minister Nara Lokesh : వినాయక నిమజ్జనాలకు డీజే వాహనాలకు అనుమతి ఇవ్వండి  •  Breaking News : 30 బంతుల్లోనే అభిషేక్ శర్మ సంచలన సెంచరీ  •  Disha Salian Case : మాజీ సీఎం కుమారుడికి ఏకంగా రూ.500 కోట్ల లీగల్ నోటీసులు.. అసలేం జరిగిందంటే?  •  Keesara SI ACB Trap : స్టేషన్ బెయిల్ కోసం రూ.5 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఎస్ఐ  •  Dadasaheb Phalke Award 2024 : ‘కేజీఎఫ్’ నటుడికి అత్యున్నత పురస్కారం.. అనంత్ నాగ్‌ను వరించిన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు!  • 
Skip to content

Chevella ACB Raid : ఏసీబీ వలలో చేవెళ్ల ఎస్‌టీఓ, ఏటీఓ.. లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ పట్టివేత

చేవెళ్ల, సూర్య న్యూస్ : చేవెళ్ల సబ్ ట్రెజరీ కార్యాలయంపై (Chevella STO Office) అవినీతి నిరోధక శాఖ అధికారులు గురువారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఒక రిటైర్డ్ ఉద్యోగికి సంబంధించిన పెన్షన్ ఫైల్ కోసం లక్ష రూపాయలు లంచం (Bribe) తీసుకుంటూ ఇద్దరు ఉన్నతాధికారులు ఏసీబీకి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.

వివరాల్లోకి వెళితే.. ఒక రిటైర్డ్ పంచాయతీ సెక్రటరీకి సంబంధించిన పెన్షన్ ఫైల్‌ను క్లియర్ చేసేందుకు ఏటీఓ అనురాధ, ఎస్‌టీఓ లక్ష్మయ్య లక్ష రూపాయలు డిమాండ్ చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతో వల పన్నారు. అవుట్ సోర్సింగ్ సిబ్బంది చిన్న అనే వ్యక్తి ద్వారా సదరు అధికారులు ఆ నగదును తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు.

లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయిన ఏటీఓ, ఎస్‌టీఓలను ఏసీబీ బృందం వెంటనే అదుపులోకి తీసుకుంది. కార్యాలయంలోని పలు కీలక ఫైళ్లను పరిశీలించడంతో పాటు, నిందితులను విచారిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

ఈ వార్తపై మీ స్పందన?

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp