
హైదరాబాద్, సూర్య న్యూస్ : హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడలో (Nanakramguda) చోటుచేసుకున్న భూవివాదంపై తనపై నమోదైన కేసు విషయంలో టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ మామ (Allu Arjun Father in Law) చంద్రశేఖర్ రెడ్డి స్పందించారు. తనపై వస్తున్న భూకబ్జా ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని ఆయన ఖండించారు.
వివాదంలో ఉన్న స్థలాన్ని తాము చట్టబద్ధంగానే కొనుగోలు చేశామని చంద్రశేఖర్ రెడ్డి స్పష్టం చేశారు. ఆ ఆస్తిపై తనకు, తన కూతురికి మాత్రమే పూర్తి చట్టపరమైన హక్కులు ఉన్నాయని వెల్లడించారు. ఇందుకు సంబంధించిన పక్కా ఆధారాలు, డాక్యుమెంట్లు తమ వద్ద ఉన్నాయని ఆయన వివరించారు.
మంత్రి కాస్మోస్ భవనం గేట్లు పగులగొట్టామని, అక్కడి సెక్యూరిటీ సిబ్బందిని బెదిరించామని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఆయన కొట్టిపారేశారు. ఈ వ్యవహారంపై కావాలనే కొందరు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని చంద్రశేఖర్ రెడ్డి అభిప్రాయపడ్డారు.
ఈ వార్తపై మీ స్పందన?

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



