|  
FLASH NEWS
రామమందిరం తొలి సీఈవోగా రిటైర్డ్ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రా.. నిధుల మళ్లింపు ఆరోపణల వేళ ట్రస్ట్ కీలక నిర్ణయం  •  ముఖ్యమంత్రి హోదాలోనే అసెంబ్లీకి కేసీఆర్.. రేవంత్ రెడ్డికి కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్  •  శ్రీలంక ఔట్, భారత్ ఇన్.. తొలి ఉమెన్స్ ఛాంపియన్స్ ట్రోఫీకి తేదీలు, జట్లు ఖరారు  •  ‘ఇరుముడి’ సీక్వెల్‌పై దర్శకుడు శివ నిర్వాణ క్లారిటీ.. రామ్ చరణ్ రూమర్స్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు  •  పవన్ బర్త్‌డే స్పెషల్: ‘ఓజీ యూనివర్స్’ పై బిగ్ అప్‌డేట్.. ఆజాద్ హింద్ ఫౌజ్ బ్యాక్‌డ్రాప్‌తో వీడియో విడుదల  • 
Skip to content

నిరుద్యోగులకు కేంద్రం శుభవార్త.. భారీ జీతంతో SSC నుంచి 1,748 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

surya news jobs updates featured
surya news jobs updates featured

న్యూఢిల్లీ, సూర్య న్యూస్ : కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు ఆశించే నిరుద్యోగులకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) గుడ్ న్యూస్ చెప్పింది. కేంద్రంలోని పలు విభాగాల్లో ఏకంగా 1,748 పోస్టుల భర్తీకి సంబంధించి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఈ నెల 22వ తేదీ వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు వెల్లడించారు.

అర్హతలు, వయోపరిమితి

జూనియర్ ఇంజినీర్ (Junior Engineer) విభాగంలో భర్తీ చేయనున్న ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు.. గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా విద్యాసంస్థ నుంచి సంబంధిత బ్రాంచ్‌లో డిప్లొమా, బీఎస్సీ, బీఈ లేదా బీటెక్ ఉత్తీర్ణులై ఉండాలి. కొన్ని నిర్దిష్ట పోస్టులకు సంబంధిత విభాగంలో పని అనుభవం కూడా తప్పనిసరి. అభ్యర్థుల వయసు 18 నుంచి 32 ఏళ్ల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్ కేటగిరీల వారికి వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.

ఎంపిక విధానం, వేతనం

అర్హులైన అభ్యర్థులను కంప్యూటర్ ఆధారిత రాత పరీక్షల ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు రుసుము కింద అభ్యర్థులు రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి పూర్తి మినహాయింపు ఉంటుంది. ఈ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ.35,400 నుంచి రూ.1,12,400 వరకు వేతనం చెల్లిస్తారు. అర్హులైన అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ వివరాలు, ఆన్‌లైన్ దరఖాస్తు కోసం అధికారిక వెబ్‌సైట్ https://ssc.gov.in ను సందర్శించవచ్చు.

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp