|  
FLASH NEWS
ISRO EOS-08 : ఇస్రో మరో అద్భుతం.. నింగిలోకి విజయవంతంగా దూసుకెళ్లిన ఎస్‌ఎస్‌ఎల్‌వీ-డీ3  •  బండి సంజయ్ : “15 నిమిషాలు పోలీసులు పక్కకు తప్పుకుంటే.. ఇదా దేశభక్తి?”  •  Janmashtami 2026 : కృష్ణాష్టమి పూజ సమయంలో ఈ పొరపాట్లు అస్సలు చేయకండి  •  Konda Surekha : మంత్రి కొండా సురేఖ బర్తరఫ్.. అధికారిక ఉత్తర్వులు జారీ!  •  CM Revanth Reddy : “రేవంత్ రెడ్డి ఓ బ్లాక్‌మెయిలర్”.. కేబినెట్ నుంచి బర్తరఫ్ వేళ కొండా సురేఖ సంచలనం!  • 
Skip to content

45 కిలోల బరువు.. 140 కిలోల డెడ్‌లిఫ్ట్: నెట్టింట సెన్సేషన్‌గా మారిన బ్యూటిఫుల్ భారత పవర్‌లిఫ్టర్

Keya Kunal Banerjee
Keya Kunal Banerjee

హైదరాబాద్, సూర్య న్యూస్ : అంతర్జాతీయ వేదికపై అద్భుత ప్రదర్శన చేసిన భారత యువ పవర్‌లిఫ్టర్ కేయా కునాల్ బెనర్జీ (Keya Kunal Banerjee) సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారారు. మాల్టా వేదికగా జరిగిన ఐపీఎఫ్ వరల్డ్ జూనియర్ ఛాంపియన్‌షిప్స్‌లో పాల్గొన్న 21 ఏళ్ల కేయా.. ఏకంగా సిల్వర్ మెడల్ కైవసం చేసుకున్నారు. అయితే, కేవలం 45.7 కిలోల బరువున్న ఈ అథ్లెట్, తన శరీర బరువు కంటే దాదాపు మూడు రెట్లు ఎక్కువ బరువును.. అనగా 140 కిలోలను అలవోకగా డెడ్‌లిఫ్ట్ (Deadlift) చేసి క్రీడా పండితులను సైతం ఆశ్చర్యపరిచారు.

ఆమె సాధించిన ఈ అరుదైన ఫీట్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో విపరీతంగా వైరల్ అవుతోంది. కేయా కునాల్ బెనర్జీ ఆటతీరుకే కాకుండా ఆమె అందం, అమాయకత్వం, చలాకీతనానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. సోషల్ మీడియా వేదికగా ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ‘మోస్ట్ బ్యూటిఫుల్ పవర్‌లిఫ్టర్’, ‘బుట్టబొమ్మ’ అంటూ కామెంట్లు పెడుతూ ఆమె వీడియోలను తెగ షేర్ చేస్తున్నారు. అద్భుతమైన ప్రతిభతో పాటు తనదైన క్యూట్ స్మైల్‌తో క్రీడాభిమానులనే కాకుండా నెటిజన్ల మనసు దోచుకుంటూ కేయా కునాల్ బెనర్జీ ప్రస్తుతం ట్రెండింగ్‌లో నిలిచారు.

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp