|  
FLASH NEWS
ISRO EOS-08 : ఇస్రో మరో అద్భుతం.. నింగిలోకి విజయవంతంగా దూసుకెళ్లిన ఎస్‌ఎస్‌ఎల్‌వీ-డీ3  •  బండి సంజయ్ : “15 నిమిషాలు పోలీసులు పక్కకు తప్పుకుంటే.. ఇదా దేశభక్తి?”  •  Janmashtami 2026 : కృష్ణాష్టమి పూజ సమయంలో ఈ పొరపాట్లు అస్సలు చేయకండి  •  Konda Surekha : మంత్రి కొండా సురేఖ బర్తరఫ్.. అధికారిక ఉత్తర్వులు జారీ!  •  CM Revanth Reddy : “రేవంత్ రెడ్డి ఓ బ్లాక్‌మెయిలర్”.. కేబినెట్ నుంచి బర్తరఫ్ వేళ కొండా సురేఖ సంచలనం!  • 
Skip to content

కృష్ణాష్టమి వేడుకల్లో రామ్ చరణ్ దంపతులు.. ఉపాసన ఎమోషనల్ పోస్ట్

Ram charan Upasana
Ram charan Upasana

హైదరాబాద్, సూర్య న్యూస్ : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), ఉపాసన (Upasana Konidela) దంపతులు శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినాన్ని తమ నివాసంలో అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. తమ గారాల పట్టి క్లింకారతో (Klin Kaara) పాటు కుటుంబంలోని ఇతర పిల్లలతో కలిసి వారు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.

పిల్లలను కృష్ణుడు, గోపికల వేషధారణలో అందంగా ముస్తాబు చేసి దేవుడి గదిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమానికి సంబంధించిన ఓ క్యూట్ ఫోటోను ఉపాసన తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో అభిమానులతో పంచుకున్నారు.

ఈ ఫోటోను షేర్ చేసిన ఉపాసన.. “నా కల నెరవేరింది. ఓం నమో భగవతే వాసుదేవాయ” అంటూ రాసుకొచ్చారు. రామ్ చరణ్ దంపతులు దేవుడి ముందు కూర్చుని పూజ చేస్తున్న ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. మెగా అభిమానులు ఈ బ్యూటిఫుల్ ఫ్యామిలీ పిక్‌ను తెగ షేర్ చేస్తూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp