రిపోర్టర్: Gopal Nayak

జగిత్యాల, సూర్య న్యూస్ : బీర్పూర్ పోలీస్ స్టేషన్ (Police Station) పరిధిలో చోటుచేసుకున్న ఓ కిడ్నాప్ (Kidnap) కేసును పోలీసులు కేవలం కొద్ది గంటల్లోనే ఛేదించారు. ఈ కేసు దర్యాప్తులో అత్యంత కీలకంగా వ్యవహరించిన కానిస్టేబుల్ మల్లేష్‌తో పాటు రాజారాంపల్లికి చెందిన గ్రామస్తులు సతీష్, ఏడుకొండలును జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ మంగళవారం ప్రత్యేకంగా సత్కరించారు. వారికి ఆయన బహుమతులు అందజేశారు.
నేరాల నియంత్రణలో పోలీసులకు ప్రజల సహకారం ఎంతో కీలకమని ఈ సందర్భంగా ఎస్పీ స్పష్టం చేశారు. అలాగే ఈ కిడ్నాప్ కేసును సత్వరమే విజయవంతంగా పరిష్కరించిన రూరల్ సీఐ సుధాకర్, ఎస్ఐ రాజు సహా ఇతర పోలీస్ సిబ్బంది పనితీరును కూడా ఆయన ప్రత్యేకంగా అభినందించారు.

పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్లో జాయిన్ అవ్వండి! 🎯
🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



