|  
● FLASH NEWS
KTR: రేవంత్, సంజయ్ బానిసల కంటే హీనంగా తయారయ్యారు: కేటీఆర్  •  Fluorosis: ఫ్లోరైడ్ బాధితులకు సాయమేది? ఎన్‌హెచ్‌ఆర్‌సీని నిలదీసిన న్యాయవాది వినోద్  •  Elections: 13కి 12 కార్పొరేషన్లు కూటమి కైవసం.. ఏ నగరంలో ఎవరు మేయర్ అంటే?  •  PawanKalyan: మురసు తుఫాన్ ఎఫెక్ట్.. అధికారులకు డిప్యూటీ సీఎం పవన్ కీలక ఆదేశాలు  •  Raptadu: రాప్తాడు ఉన్మాది హేమంత్ కాలు తొలగింపు.. కఠిన సెక్షన్లతో కేసు  • 
Skip to content

Nani The Paradise Movie : ట్రైలర్ లేకుండానే థియేటర్లలోకి భారీ చిత్రం.. నెట్టింట వైరల్ అవుతున్న వార్తలపై నాని క్లారిటీ!

హైదరాబాద్, సూర్య న్యూస్ : న్యాచురల్ స్టార్ నాని (Hero Nani) హీరోగా వస్తున్న ‘ది ప్యారడైజ్’ (The Paradise Movie) సినిమాపై వస్తున్న పలు రూమర్లకు ఆయన చెక్ పెట్టారు. గతంలో వీరి కాంబినేషన్‌లో వచ్చిన దసరా మూవీ ఘన విజయం సాధించింది. దీంతో ఇప్పుడు వస్తున్న ఈ సినిమాపై మొదటి నుంచే భారీ ఆసక్తి నెలకొంది.

ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్ విడుదల ఉండదని నాని తాజాగా స్పష్టం చేశారు. సినిమా విడుదలకు చాలా తక్కువ సమయం మాత్రమే మిగిలి ఉంది. ఈ కారణంగా ట్రైలర్‌ను కట్ చేసి విడుదల చేయడానికి తగినంత సమయం లేకపోయిందని ఆయన తెలిపారు. మేకర్స్ అందుబాటులో ఉన్న కంటెంట్‌తోనే సినిమాను ప్రేక్షకుల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.

ఆ వార్తల్లో నిజం లేదు

సినిమా షూటింగ్ సమయంలో దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఎవరినో కొట్టారంటూ సోషల్ మీడియాలో ఇటీవల ప్రచారం జరుగుతోంది. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని నాని స్పష్టం చేశారు. సినిమాలో భారీ అండర్ వాటర్ ఎపిసోడ్ ఉందనే ప్రచారాన్ని ఆయన ఖండించారు. అలాగే ఏకంగా 1,000 మందితో భారీ ఫైట్ సీక్వెన్స్ తెరకెక్కించారనే వార్తలను కూడా ఆయన కొట్టిపారేశారు.

సినిమా రిలీజ్ డేట్ విషయంలో ఎలాంటి మార్పు లేదు. ముందుగా ప్రకటించినట్టుగానే సెప్టెంబర్ 24న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందని నాని క్లారిటీ ఇచ్చారు. ట్రైలర్ లేకుండానే సినిమా థియేటర్లలోకి రాబోతుండటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ఈ వార్తపై మీ స్పందన?

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp