విద్యారంగంలో విశేష సేవలకు ఘన సత్కారం

మునుగోడు: విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తూ, వారిలో సైన్స్ పట్ల ఆసక్తిని పెంపొందిస్తున్న కొండ్ర సైదమ్మకు ‘ఉత్తమ ఉపాధ్యాయురాలు’ అవార్డు వరించింది. మండలంలోని కొరటికల్ గ్రామానికి చెందిన ఆమె.. చందుపట్ల మహాత్మా జ్యోతిబా పూలే బాలికల పాఠశాలలో టీజీటీ (ఫిజికల్ సైన్స్) ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వర్తిస్తున్నారు. కట్టంగూర్ పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆమెకు ఈ అవార్డును అందజేసి ఘనంగా సత్కరించారు.

మండల విద్యాశాఖ అధికారి అంబటి అంజయ్య, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ గుత్తా మంజుల చేతుల మీదుగా సైదమ్మ ఈ పురస్కారాన్ని అందుకున్నారు. విద్యాబోధనలో తనదైన ముద్ర వేయడంతో పాటు, డిప్యూటీ వార్డెన్‌గా విద్యార్థుల సంక్షేమం, వారి అవసరాల పట్ల ఆమె చూపుతున్న ప్రత్యేక శ్రద్ధను ఈ సందర్భంగా పలువురు వక్తలు కొనియాడారు.
అనంతరం సైదమ్మ మాట్లాడుతూ.. తన తల్లిదండ్రులు, భర్త డాక్టర్ శిర్గమల్ల కిషోర్, అత్తమామల ప్రోత్సాహంతోనే వృత్తి పట్ల అంకితభావంతో పనిచేస్తున్నానని తెలిపారు. ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపికైన ఆమెను పాఠశాల ప్రిన్సిపాల్ పనసం మాధవి, తోటి ఉపాధ్యాయులు, సిబ్బందితో పాటు కుటుంబ సభ్యులు, కొరటికల్ గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తూ ప్రత్యేక అభినందనలు తెలిపారు.
ఈ వార్తపై మీ స్పందన?

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



