|  
FLASH NEWS
AP Liquor Policy : మద్యం ప్రియులు, వ్యాపారులకు బిగ్ అలర్ట్.. ఎంఆర్‌పీ కంటే ఎక్కువకు అమ్మితే రూ.10 లక్షల ఫైన్!  •  TGPSC Notification Cancelled : నిరుద్యోగులకు బిగ్ షాక్.. ఆ 544 పోస్టుల నోటిఫికేషన్‌ రద్దు చేస్తూ కీలక ప్రకటన!  •  Modi Gifts Putin : రష్యా అధ్యక్షుడికి ప్రధాని మోదీ ప్రత్యేక బహుమతి.. పుతిన్‌ను ఆకర్షించిన ఆ అరుదైన పుస్తకం ఏమిటంటే?  •  Jio Network Issue : సిగ్నల్ రావడం లేదని వినూత్న నిరసన.. టెలికాం ఉద్యోగిని ఏకంగా టవర్‌కే కట్టేసిన గ్రామస్తులు!  •  KTR Comments on Konda Surekha : మంత్రి కొండా సురేఖ బర్తరఫ్‌ వెనుక మంచిరేవుల భూకుంభకోణం.. రేవంత్ సర్కార్‌పై కేటీఆర్ సంచలన ఆరోపణలు  • 
Skip to content

AP Liquor Policy : మద్యం ప్రియులు, వ్యాపారులకు బిగ్ అలర్ట్.. ఎంఆర్‌పీ కంటే ఎక్కువకు అమ్మితే రూ.10 లక్షల ఫైన్!

అమరావతి, సూర్య న్యూస్ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సరికొత్త మద్యం పాలసీని (AP Liquor Policy) అధికారికంగా ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మద్యం దుకాణాల ప్రస్తుత లైసెన్సుల రెన్యువల్ ఫీజును 10 శాతం మేర పెంచుతూ ఎక్సైజ్ శాఖ (Excise Department) నిర్ణయం తీసుకుంది. అదే సమయంలో నిబంధనలు ఉల్లంఘించే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకునేలా సరికొత్త నిబంధనలను ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది.

నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానా

కొత్త నిబంధనల ప్రకారం మద్యం సీసాలపై ముద్రించిన గరిష్ఠ చిల్లర ధర కంటే అధిక ధరకు విక్రయించినా, కల్తీ మద్యానికి పాల్పడినా లేదా బ్రాండ్ మిక్సింగ్ చేసినా వ్యాపారులకు ఏకంగా రూ.10 లక్షల భారీ జరిమానా విధించనున్నారు. నిబంధనలను పక్కాగా అమలు చేయాలని, వినియోగదారులను మోసం చేసే దుకాణదారులపై కఠినంగా వ్యవహరించాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.

లక్కీ డ్రా ద్వారా మిగిలిన షాపుల కేటాయింపు

రెన్యువల్ పూర్తికాని మద్యం దుకాణాలను రూ.3 లక్షల నాన్ రిఫండబుల్ దరఖాస్తు రుసుముతో లక్కీ డ్రా పద్ధతి ద్వారా కేటాయించనున్నారు. మొత్తం షాపులలో 3,396 దుకాణాలను ఓపెన్ కేటగిరీ కింద ఉంచగా, గీత వృత్తిపై ఆధారపడిన కల్లుగీత కార్మికులకు ప్రోత్సాహకంగా 340 దుకాణాలను ప్రత్యేకంగా రిజర్వ్ చేశారు. పారదర్శకంగా లాటరీ ప్రక్రియను నిర్వహించి దుకాణాలను కేటాయించేందుకు ఎక్సైజ్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ వార్తపై మీ స్పందన?

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp