|  
FLASH NEWS
China Ocean Minerals : పసిఫిక్ సముద్ర గర్భంలో అపారమైన బంగారం, వెండి నిక్షేపాలు.. చైనా పరిశోధకుల సంచలన గుర్తింపు  •  Artificial Paneer Ban : తెలంగాణలో పనీర్ ప్రియులకు షాక్.. కృత్రిమ పనీర్ తయారీ, విక్రయాలపై ఏడాది పాటు నిషేధం  •  Joe Root Records : సచిన్ టెండూల్కర్ రికార్డు బద్దలు.. టెస్టుల్లో చరిత్ర సృష్టించిన ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్!  •  HYDRA Toll Free Number : హైదరాబాద్ ప్రజలకు అలర్ట్.. అత్యవసర సేవల కోసం హైడ్రా టోల్ ఫ్రీ నెంబర్ ఇదే!  •  AP Liquor Policy : మద్యం ప్రియులు, వ్యాపారులకు బిగ్ అలర్ట్.. ఎంఆర్‌పీ కంటే ఎక్కువకు అమ్మితే రూ.10 లక్షల ఫైన్!  • 
Skip to content

Artificial Paneer Ban : తెలంగాణలో పనీర్ ప్రియులకు షాక్.. కృత్రిమ పనీర్ తయారీ, విక్రయాలపై ఏడాది పాటు నిషేధం

హైదరాబాద్, సూర్య న్యూస్ : తెలంగాణ రాష్ట్రంలో ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాలతో సంబంధం లేకుండా వివిధ రసాయనాలు, ఇతర పదార్థాలతో తయారుచేసే కృత్రిమ లేదా నాన్-డెయిరీ పనీర్ (Artificial Paneer) తయారీ, నిల్వ మరియు అమ్మకాలపై తెలంగాణ వ్యాప్తంగా ఏడాది పాటు నిషేధం విధిస్తూ ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు.

తెలంగాణ ఫుడ్ అండ్ ఎసెన్షియల్ డ్రగ్స్ స్టాండర్డ్స్ అథారిటీ (టీజీ సేఫ్) కమిషనర్ ఈ మేరకు సెప్టెంబర్ 11న అధికారిక పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ చట్టం 2006 నిబంధనల ప్రకారం ఈ నిషేధాజ్ఞలు అమల్లోకి వస్తాయని స్పష్టం చేశారు. తాజా ఆదేశాల ప్రకారం రాష్ట్రంలో ఎక్కడైనా సరే నాన్-డెయిరీ పనీరు తయారు చేయడం, ప్రాసెసింగ్, ప్యాకింగ్, నిల్వ చేయడం, రవాణా లేదా పంపిణీ చేయడం పూర్తిగా చట్టవిరుద్ధం.

సెప్టెంబర్ 10 నుంచి అమల్లోకి..

ప్రజారోగ్యానికి ముప్పు వాటిల్లుతున్న నేపథ్యంలో తీసుకున్న ఈ కఠిన నిర్ణయం 2026 సెప్టెంబర్ 10వ తేదీ నుంచి తక్షణమే అమల్లోకి వచ్చి సరిగ్గా ఒక సంవత్సరం పాటు కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు. దీనికి సంబంధించి ప్రభుత్వం 807వ నెంబర్‌తో అధికారిక గెజిట్ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. అసలైన పనీర్ పేరుతో మార్కెట్‌లో నకిలీ పనీర్ అమ్ముతూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడితే సహించేది లేదని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఈ వార్తపై మీ స్పందన?

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp