
హైదరాబాద్, సూర్య న్యూస్ : శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) సంచలన నిర్ణయం తీసుకుంది. పండుగ సందర్భంగా రేపు అనగా సెప్టెంబర్ 4, శుక్రవారం నాడు నగర పరిధిలోని అన్ని మాంసం దుకాణాలు, కబేళాలను మూసివేయాలని ఆదేశాలు జారీ చేస్తూ నాన్ వెజ్ ప్రియులకు షాక్ ఇచ్చింది.
నగరంలోని గొర్రెలు, మేకలు, పశువుల కబేళాలతో పాటు రిటైల్ మాంసం, బీఫ్ మరియు చికెన్ దుకాణాలకు ఈ మూసివేత ఆదేశాలు ఖచ్చితంగా వర్తిస్తాయని అధికారులు స్పష్టం చేశారు. శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగ ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని జీహెచ్ఎంసీ చట్టం-1955లోని సెక్షన్ 533(బి) కింద ఈ ఉత్తర్వులు జారీ చేసినట్లు మున్సిపల్ కమిషనర్ ఆమ్రపాలి కాట బుధవారం వెల్లడించారు. నిబంధనలు ఉల్లంఘించి దుకాణాలు తెరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



