
హైదరాబాద్, సూర్య న్యూస్ : టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) నటిస్తున్న తాజా యాక్షన్ ఎంటర్టైనర్ ‘రణబాలి’ మూవీ విడుదలపై వస్తున్న వదంతులకు చెక్ పడింది. ఈ సినిమా రిలీజ్ (Movie Release) వాయిదా పడుతుందన్న ప్రచారాన్ని చిత్ర బృందం అధికారికంగా ఖండించింది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 16వ తేదీనే ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్ స్పష్టం చేశారు.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ తుది దశకు చేరుకుందని, అతి త్వరలోనే చిత్రీకరణ మొత్తం పూర్తవుతుందని చిత్ర బృందం తెలిపింది. ఒకవైపు షూటింగ్ జరుపుతూనే మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా శరవేగంగా పూర్తి చేస్తున్నట్లు వెల్లడించింది. ఇప్పటికే సినిమా ఫస్ట్ హాఫ్‌కు సంబంధించిన నేపథ్య సంగీతం పనులు పూర్తయినట్లు మేకర్స్ పేర్కొన్నారు. ప్రముఖ సంగీత దర్శకులు అజయ్-అతుల్ ఈ చిత్రానికి స్వరాలు సమకూర్చుతున్నారు.
ట్యాక్సీవాలా ఫేమ్ రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో అత్యంత భారీ వ్యయంతో ఈ సినిమా తెరకెక్కుతోంది. విజయ్ దేవరకొండ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్న కథానాయికగా నటిస్తోంది. సినిమా వాయిదా పడుతుందనే వార్తలతో నిరాశకు గురైన అభిమానులకు, తాజా ప్రకటనతో చిత్ర బృందం పెద్ద ఊరటనిచ్చింది. దీంతో అక్టోబర్ 16న ఈ చిత్రం థియేటర్లలో భారీ స్థాయిలో సందడి చేయనుంది.
ఈ వార్తపై మీ స్పందన?

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



