
హైదరాబాద్, సూర్య న్యూస్ : తెలంగాణలో పేదల కోసం ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల (Indiramma Indlu) కేటాయింపులను ఆసరాగా చేసుకుని కొందరు దళారులు మోసాలకు పాల్పడుతున్నారని, వారి మాటలు నమ్మి మోసపోవద్దని తెలంగాణ హౌసింగ్ బోర్డు (Telangana Housing Board) వైస్ చైర్మన్ గౌతమ్ హెచ్చరించారు. ఇళ్లు ఇప్పిస్తామంటూ అమాయకులైన ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసేందుకు కొందరు బ్రోకర్లు, మధ్యవర్తులు ప్రయత్నిస్తున్నారన్న విషయం తమ దృష్టికి వచ్చిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ఇళ్ల కేటాయింపు ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా, ప్రభుత్వ నిబంధనల ప్రకారమే జరుగుతుందని అధికారులు స్పష్టం చేశారు. ఈ ప్రక్రియలో మధ్యవర్తుల ప్రమేయం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండదని, కాబట్టి లబ్ధిదారులు దళారులకు ఎలాంటి కమీషన్లు చెల్లించాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు. ఎవరైనా అధికారులు లేదా నాయకుల పేరు చెప్పి డబ్బులు డిమాండ్ చేస్తే నమ్మవద్దని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వమే నేరుగా ఇళ్లను కేటాయిస్తుందని భరోసా ఇచ్చారు.
ఇళ్ల కేటాయింపులకు సంబంధించి ప్రజలకు ఎలాంటి సందేహాలున్నా నేరుగా హౌసింగ్ బోర్డును సంప్రదించాలని సూచించారు. దీనికోసం బోర్డు అధికారిక వెబ్సైట్ tghb.telangana.gov.in ను సందర్శించాలని, లేదా 040-24603572 నంబర్‌కు కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చని వెల్లడించారు. మధ్యవర్తులను ఆశ్రయించి అనవసరంగా డబ్బులు పోగొట్టుకోవద్దని ప్రజలకు సూచించారు.
ఈ వార్తపై మీ స్పందన?

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



