
న్యూఢిల్లీ, సూర్య న్యూస్ : భారత్‌లో జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు (BRICS Summit 2026) వేదికగా సభ్య దేశాలు ఉగ్రవాదంపై గట్టి సందేశం ఇచ్చాయి. ఇటీవలే జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో (Pahalgam) జరిగిన ఉగ్రదాడిని బ్రిక్స్ దేశాలు తీవ్రంగా ఖండించాయి. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా సహించేది లేదని, దాని ప్రేరణ, ప్రాంతం, కారణాలతో ఎలాంటి సంబంధం లేదని ‘ఢిల్లీ డిక్లరేషన్’ (Delhi Declaration) ద్వారా సభ్య దేశాలు స్పష్టం చేశాయి.
సరిహద్దు ఉగ్రవాదంతో పాటు, ఉగ్రవాదానికి నిధులు సమకూర్చడం, వారికి స్థావరాలు ఏర్పాటు చేయడం వంటి చర్యలను అరికట్టేందుకు తాము కట్టుబడి ఉన్నామని బ్రిక్స్ ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నాయి. ఐక్యరాజ్యసమితి (UN) ఉగ్రవాదులుగా ప్రకటించిన వ్యక్తులు, సంస్థలపై సమిష్టిగా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా సభ్య దేశాలు తీర్మానించాయి. కాగా, ఈ సదస్సు సందర్భంగా పర్యావరణ పరిరక్షణలో భాగంగా బ్రిక్స్ నేతలంతా కలిసి మొక్కలు నాటారు.
ఈ వార్తపై మీ స్పందన?

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



