|  
FLASH NEWS
Konda Surekha : ఢిల్లీకి రావాలని కాంగ్రెస్ పెద్దల కబురు.. కొండా సురేఖకు మరో కీలక పదవి గ్యారెంటీనా?  •  BRICS Summit 2026 : భారత్‌లో బ్రిక్స్ సదస్సు సక్సెస్.. ప్రధాని మోదీ దౌత్యంపై విదేశీ మీడియా ప్రశంసలు  •  China Ocean Minerals : పసిఫిక్ సముద్ర గర్భంలో అపారమైన బంగారం, వెండి నిక్షేపాలు.. చైనా పరిశోధకుల సంచలన గుర్తింపు  •  Artificial Paneer Ban : తెలంగాణలో పనీర్ ప్రియులకు షాక్.. కృత్రిమ పనీర్ తయారీ, విక్రయాలపై ఏడాది పాటు నిషేధం  •  Joe Root Records : సచిన్ టెండూల్కర్ రికార్డు బద్దలు.. టెస్టుల్లో చరిత్ర సృష్టించిన ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్!  • 
Skip to content

తెలంగాణ గవర్నర్‌ను కలిసిన అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ వీసీ ప్రొఫెసర్ చక్రపాణి

రిపోర్టర్: Raju

హైదరాబాద్, సూర్య న్యూస్. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లాతో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వీసీ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. త్వరలో జరగనున్న వర్సిటీ స్నాతకోత్సవ సన్నాహాల గురించి వివరించి, ఈ వేడుకకు గవర్నర్‌ను ఆహ్వానించడంతో పాటు ఆయన సలహాలు సూచనలు కోరారు. అత్యంత సానుకూల వాతావరణంలో జరిగిన ఈ భేటీ పట్ల ప్రొఫెసర్ చక్రపాణి హర్షం వ్యక్తం చేశారు.

ఈ సమావేశంలో విశ్వవిద్యాలయంలో అమలు చేస్తున్న నూతన విద్యా సంస్కరణలు, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మోడల్స్ వినియోగంపై గవర్నర్‌కు వీసీ వివరించారు. వర్సిటీని పూర్తిగా ఆన్‌లైన్ విద్యావిధానం దిశగా తీసుకెళ్లడం, కొత్త ఆన్‌లైన్ కోర్సులను ప్రవేశపెట్టడం, క్యాంపస్‌లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.

ఈ వార్తపై మీ స్పందన?

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp