
హైదరాబాద్, సూర్య న్యూస్: టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ (Prashanth Varma) రూపొందిస్తున్న ‘ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్’ (PVCU) నుండి మరో ఆసక్తికరమైన అప్డేట్ వచ్చింది. బాలీవుడ్ సీనియర్ నటుడు అక్షయ్ ఖన్నా (Akshaye Khanna) పుట్టినరోజును పురస్కరించుకుని, ఆయన నటిస్తున్న ‘మహాకాళి’ (Mahakali) చిత్రం గురించి ప్రశాంత్ వర్మ ప్రత్యేకంగా స్పందించారు.
ఇటీవల ‘ధురంధర్’ (Dhurandhar) సినిమాతో బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ సృష్టించిన అక్షయ్ ఖన్నా, ఆ చిత్రంలో నెగటివ్ షేడ్ ఉన్న ‘రహమాన్ డకాయిట్’ పాత్రలో అద్భుతంగా నటించి పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందారు. ఇప్పుడు ఆయన తెలుగులో ప్రశాంత్ వర్మ యూనివర్స్‌లో భాగమైన ‘మహాకాళి’ చిత్రంలో కీలకమైన ‘శుక్రాచార్య’ (Shukracharya) పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్రానికి పూజా కొల్లూరు (Puja Kolluru) దర్శకత్వం వహిస్తుండగా, ప్రశాంత్ వర్మ షో రన్నర్‌గా వ్యవహరిస్తున్నారు.
📢 బ్రేకింగ్ న్యూస్ మిస్ అవ్వకండి!
తాజా వార్తలు వెంటనే పొందాలంటే Surya News అధికారిక WhatsApp Channel లో ఇప్పుడే Join అవ్వండి.
📲 Join WhatsApp Channelఅక్షయ్ ఖన్నాకు బర్త్ డే విషెస్ చెబుతూ ప్రశాంత్ వర్మ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ చేశారు. “ప్రతిభకు శబ్దం అవసరం లేదు. మీతో కలిసి పనిచేయడం నాకు దక్కిన గౌరవం. మనం ఏం సృష్టించామో ప్రపంచానికి చూపించాలని నా మనసు ఉవ్విళ్లూరుతోంది” అంటూ పేర్కొన్నారు. అక్షయ్ ఖన్నాకు సంబంధించిన షూటింగ్ పార్ట్ ఇప్పటికే పూర్తయినట్లు సమాచారం.
మరో 40 రోజుల చిత్రీకరణ జరిగితే సినిమా మొత్తం పూర్తవుతుందని తెలుస్తోంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను వచ్చే ఏడాది థియేటర్లలోకి తీసుకువచ్చేందుకు చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. ఈ చిత్రంలో కన్నడ నటి భూమి శెట్టి (Bhoomi Shetty) లీడ్ రోల్ పోషిస్తోంది. గతంలోనే విడుదలైన అక్షయ్ ఖన్నా ‘శుక్రాచార్య’ ఫస్ట్ లుక్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచింది.



