|  
FLASH NEWS
PM Modi Ganesh Puja: కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఇంట గణపతి పూజలో పాల్గొన్న ప్రధాని  •  Major Rishabh Singh : ఆర్మీకి యువ మేజర్ ముందస్తు వీడ్కోలు.. రాజీనామాకు అసలు కారణం ఇదే  •  Indiramma Indlu Telangana : ఇందిరమ్మ ఇళ్ల పేరుతో దళారుల మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక  •  IND vs AFG T20 : అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లో తొలిసారి వందేమాతరం.. ఆ తర్వాతే జాతీయ గీతం  •  Women’s Asia Cup 2026 : శ్రీలంకపై ప్రతీకారం.. ఎనిమిదోసారి ఆసియా కప్ విజేతగా టీమిండియా  • 
Skip to content

India China Relations : ప్రధాని మోదీ వ్యాఖ్యలపై చైనా ప్రశంసలు.. స్వతంత్ర విధానానికి మద్దతు

బీజింగ్, సూర్య న్యూస్ డెస్క్: భారతదేశం స్వతంత్ర విదేశాంగ విధానాన్ని (Foreign Policy) అనుసరిస్తుందంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) చేసిన వ్యాఖ్యలను చైనా ప్రభుత్వం స్వాగతించింది. భారత్, చైనా ద్వైపాక్షిక సంబంధాల మధ్య మూడో పక్షం జోక్యానికి తావులేదన్న ప్రధాని మోదీ ప్రకటనను ప్రశంసిస్తూ, ఆయన చేసిన వ్యాఖ్యలకు తాము పూర్తి విలువనిస్తామని చైనా స్పష్టం చేసింది.

ఇరు దేశాలు పరస్పర భాగస్వాములుగా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి గో్వ జియాకున్ పేర్కొన్నారు. ఒకరి అభివృద్ధికి మరొకరు తోడ్పాటు అందించుకుంటూ, ఇరు దేశాల బలాలతో పరస్పరం ప్రయోజనం పొందాలని చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఇప్పటికే స్పష్టం చేశారని ఆయన గుర్తుచేశారు. ప్రపంచ వేదికపై రెండు ప్రధాన దేశాల మధ్య సహకారం ఎంతైనా అవసరమని వ్యాఖ్యానించారు.

సరిహద్దు మరియు అంతర్జాతీయ అంశాల్లో ఎలాంటి బాహ్య శక్తుల ప్రభావం లేకుండా స్వతంత్రంగా వ్యవహరిస్తామన్న భారత వైఖరిని చైనా సమర్థించడం ప్రాధాన్యత సంతరించుకుంది. పరస్పర విశ్వాసం, గౌరవంతో ద్వైపాక్షిక సంబంధాలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని చైనా అధికారికంగా వెల్లడించింది.

ఈ వార్తపై మీ స్పందన?

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp