|  
FLASH NEWS
PM Modi Friend : ప్రధాని మోదీని కలిసిన కొద్దిరోజుల్లోనే పరిష్కారం.. దశాబ్దాల భూ వివాదంలో ఆ స్నేహితుడికి ఊరట ఎలా లభించిందో తెలుసా?  •  Miss Universe India 2026 : మిస్ యూనివర్స్ వేదిక నుంచి ఆఫీస్‌కు.. తిరిగి విధుల్లో చేరిన అందాల భామ  •  Allu Arjun Father in Law : అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు..  •  PM Modi Ganesh Puja: కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఇంట గణపతి పూజలో పాల్గొన్న ప్రధాని  •  Major Rishabh Singh : ఆర్మీకి యువ మేజర్ ముందస్తు వీడ్కోలు.. రాజీనామాకు అసలు కారణం ఇదే  • 
Skip to content

Apple Foldable Phones : యాపిల్ నుంచి మరిన్ని కొత్త మడత ఫోన్లు.. ఆ రెండు కంపెనీలకు గట్టి పోటీ తప్పదా?

కాలిఫోర్నియా :​ ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ (Apple) మొబైల్ మార్కెట్లో సరికొత్త సంచలనానికి తెరతీస్తోంది. ఇటీవల తన తొలి ఫోల్డబుల్ ఫోన్ ఐఫోన్ డుయో (iPhone Duo) ను లాంచ్ చేసిన ఈ సంస్థ.. భవిష్యత్తులో మరిన్ని మడత ఫోన్లను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురావాలని సన్నాహాలు చేస్తోంది.

ప్రస్తుతం ఉన్న మోడల్ కు కొనసాగింపుగా డుయో మ్యాక్స్ పేరుతో తదుపరి వెర్షన్ ను లాంచ్ చేసేందుకు యాపిల్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. అలాగే సామాన్య వినియోగదారులను కూడా ఆకర్షించే ఉద్దేశ్యంతో ఇంకాస్త తక్కువ ధరలో డుయో ఎస్ఈ, మినీ అనే పేర్లతో సరికొత్త ఫోల్డబుల్ మోడల్స్ తీసుకువచ్చే అంశాన్ని కంపెనీ తీవ్రంగా పరిశీలిస్తోంది.

ఇప్పటికే ఫోల్డబుల్ ఫోన్స్ విభాగంలో శాంసంగ్, గూగుల్ కంపెనీలు భారీ మోడల్స్ తో ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. వీటికి గట్టి పోటీ ఇవ్వడంతో పాటు మడత ఫోన్ల మార్కెట్ వాటాను పూర్తిగా కైవసం చేసుకునే వ్యూహంలో భాగంగా యాపిల్ ఈ సరికొత్త ప్రణాళికను సిద్ధం చేసినట్లు టెక్ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

ఈ వార్తపై మీ స్పందన?

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp