|   
🔴 BREAKING NEWS ► BJP MP K Laxman : 22ఏ పేరిట వేల కోట్ల దోపిడీ.. సామాన్యుల ఆస్తులపై కాంగ్రెస్ దందా: ఎంపీ లక్ష్మణ్ సంచలనం! Ministry of Education : దేశవ్యాప్తంగా పాఠశాల విద్యలో భారీ మార్పులు.. కేంద్ర విద్యాశాఖ కీలక నివేదిక! Kukatpally News : రాష్ట్ర స్థాయి అవార్డులు కొల్లగొట్టిన కూకట్‌పల్లి జర్నలిస్టులు – ఘనంగా సన్మానించిన TWJF TTD Fake Websites Alert : తిరుమల భక్తులకు టీటీడీ బిగ్ అలర్ట్.. ఆ లింక్స్ క్లిక్ చేస్తే డబ్బులు గోవిందా Telangana Police Jobs Age Limit : తెలంగాణ పోలీసు అభ్యర్థులకు గుడ్ న్యూస్.. పెరిగిన వయోపరిమితి (Age Limit).. పూర్తి వివరాలు ఇవే
Skip to content

Nalgonda : రైతన్నకు సాగు భరోసా: సబ్సిడీపై మినీ ట్రాక్టర్ల పంపిణీ.. కలెక్టర్ చంద్రశేఖర్ కీలక పిలుపు

నల్గొండ, సూర్య న్యూస్: ఉద్యాన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న మినీ ట్రాక్టర్లు, కూరగాయల మినీ కిట్లను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. బుధవారం నల్గొండ జిల్లా కలెక్టరేట్ ఆవరణలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో సమీకృత ఉద్యాన మిషన్ కింద ఎంపికైన లబ్ధిదారులకు ఆయన మినీ ట్రాక్టర్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఆధునిక యంత్రాల వినియోగంతో సాగు పనులు సులభతరమవుతాయని, తద్వారా రైతులకు పెట్టుబడి ఖర్చు తగ్గుతుందని ఆకాంక్షించారు.

సబ్సిడీతో సాగు సులభం

జిల్లాకు మొత్తం 30 మినీ ట్రాక్టర్లు మంజూరయ్యాయని, ఇందులో మొదటి విడతగా ముగ్గురు రైతులకు 40 శాతం సబ్సిడీపై ఈ ట్రాక్టర్లను అందజేసినట్లు కలెక్టర్ వెల్లడించారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ మినీ కిట్లు మరియు యంత్రాల ద్వారా ఉద్యాన పంటల సాగులో రైతులు మరింత లాభాలను గడించవచ్చని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. సాగును లాభసాటిగా మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం ఇలాంటి పథకాలను అమలు చేస్తోందని పేర్కొన్నారు.

​మినీ ట్రాక్టర్ల పంపిణీతో పాటు రైతులకు కావాల్సిన కూరగాయల మినీ కిట్లను కూడా అధికారులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉద్యానవన శాఖ అధికారులు, సిబ్బంది మరియు లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రభుత్వ సహకారం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తూ కలెక్టర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📲 Join WhatsApp