
హైదరాబాద్, సూర్య న్యూస్ : రాష్ట్రంలోని రైతులకు ఆధునిక సాంకేతికతను చేరువ చేస్తూ వ్యవసాయంలో మెరుగైన ఫలితాలు సాధించేలా తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI in Agriculture) ఆధారంగా రైతులకు మాతృభాష తెలుగులోనే వ్యవసాయ సలహాలు అందించేందుకు రాష్ట్ర వ్యవసాయ శాఖ, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ స్మార్ట్ గవర్నమెంట్ (NISG) మధ్య కీలక ఒప్పందం కుదిరింది.
కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ‘భారత్ విస్తార్’ ప్లాట్‌ఫామ్ ద్వారా ఈ సేవలను అన్నదాతలకు చేరువ చేయనున్నారు. ఈ అత్యాధునిక టెక్నాలజీ సాయంతో పంటల సాగు విధానాలు, వాతావరణ పరిస్థితులు, తెగుళ్ల నివారణ, సరైన ఎరువుల వినియోగంపై రైతులకు కచ్చితమైన సమాచారం అందుతుంది. వీటితో పాటు స్థానిక మార్కెట్ ధరలు, వివిధ ప్రభుత్వ పథకాల వివరాలను కూడా రైతులు సులభంగా తెలుసుకునే వెసులుబాటు కలుగుతుంది.
రైతులకు అందుబాటులోకి టోల్ ఫ్రీ, వాట్సాప్ సేవలు
ఈ ఆధునిక సేవలను రైతులు సులభంగా, ఎప్పటికప్పుడు పొందేందుకు వీలుగా ప్రభుత్వం బహుళ మాధ్యమాలను అందుబాటులోకి తీసుకురానుంది. ఇందులో భాగంగా 155261 టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నంబర్‌ను ఏర్పాటు చేయనున్నారు. అలాగే ప్రత్యేక వెబ్ పోర్టల్, మొబైల్ యాప్‌తో పాటు వాట్సాప్ చాట్‌బాట్ సేవలను సైతం పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఈ వార్తపై మీ స్పందన?
🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



